Lionel Messi Hyderabad visit : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇండియా టూర్‌లో భాగంగా హైదరాబాద్‌ను కూడా చేర్చినట్టు ప్రకటించడంతో… తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్‌కు సంబంధించిన ఏర్పాట్లలో ఆసక్తిగా పాల్గొంటున్నారు.
డిసెంబర్ 13న హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్ ఆడనుండగా, ఈ టూర్‌లో కోల్‌కతా, ముంబై, ఢిల్లీతో పాటు ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.
Latest news: Holidays table: 2026 సెలవుల జాబితా విడుదల
సోషల్ మీడియాలో మెస్సీ చేసిన పోస్ట్ ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
“ఇండియా నుంచి వస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఇంకొన్ని వారాల్లో GOAT టూర్ ప్రారంభం కానుంది. కోల్‌కతా, ముంబై, ఢిల్లీతో పాటు ఇప్పుడు (Lionel Messi Hyderabad visit) హైదరాబాద్‌ను కూడా జోడిస్తున్నాను. త్వరలో కలుద్దాం, ఇండియా,” అని మెస్సీ పేర్కొన్నాడు.
GOAT అంటే Greatest Of All Time అని, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మెస్సీకి ఇచ్చే ప్రత్యేక గుర్తింపు ఇది. మెస్సీ హైదరాబాద్‌కు రావడం రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురానుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/