ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ కప్ విజేత లియోనల్ మెస్సి (Lionel Messi) భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 13న హైదరాబాద్ కు, కూడా రానున్నాడు మెస్సి. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.. మరికొన్ని వారాల్లో గోట్ టూర్ ప్రారంభంకానున్నదని, భారత్ ప్రదర్శిస్తున్న ప్రేమ పట్ల థ్యాంక్స్ చెబుతున్నట్లు పేర్కొన్నారు. తన విజిట్‌లో హైదరాబాద్ నగరాన్ని కూడా జోడించారని, ఇది సంతోషకరమైన విషయం అన్నారు.
Read Also: OTD: ఒకే ఓవర్లో 7 సిక్సులతో రుతురాజ్ గైక్వాడ్ విజయం
సీఎం రేవంత్ స్పందించారు
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సి (Lionel Messi) ఇండియాలోని కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాలతో పాటు హైదరాబాద్‌లో కూడా పర్యటించనున్నారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ‘డిసెంబర్ 13న హైదరాబాద్ కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డ మీద మీలాంటి ఫుట్బాల్ స్టార్ని చూడాలని కలలుగన్న ప్రతి అభిమానికి ఇది ఎగ్జెటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమైంది’ అని ట్వీట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: