ఒక దేశంలోకి వలస వెళ్లినప్పుడు తమ స్వదేశ గౌరవాన్ని పెంచాలి. విదేశాల్లో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా జీవించాలి .లేకపోతే దేశ పరువు పోతుంది. స్వదేశీ గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. లేకపోతే దాని పర్యవసానాలు ఘోరంగా ఉంటాయి. తాజాగా పాకిస్తాన్ పౌరులు యూఏఈ కి వెళ్లి అక్కడ నేరాలకు పాల్పడుతూ, భిక్షగాళ్లుగా మారుతున్నారు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు కొత్త తలనొప్పులు వచ్చాయి. దీంతో పాకిస్తాన్ (Pakistan) పౌరులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త వీసాలను నిలిపివేసినట్లు తెలిసింది.
Read Also: Delhi Pollution: కాలుష్యంపై పార్లమెంట్ లో చర్చకు రాహుల్ డిమాండ్

యూఏఈకి (UAE) చేరుకున్న తర్వాత అనేక మంది పాకిస్థానీయులు నేర కార్యకలాపాలు, భిక్షాలటనలో పాల్గొంటున్నారనే ఆందోళనల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల సెక్రటరీ సల్మాన్ చౌద్రీ సెనేట్ ఫంక్షనల్ కమిటి ఆన్ హ్యూమన్ రైట్స్ సమావేశంలో వెల్లడించారు.
నేరాల్లో పట్టుపడుతున్న పాక్ ప్రజలు
టూరిస్ట్ వీసాలపై (Visa) యూఏఈకి వస్తున్న అనేకమంది పాకిస్థానీయులు భిక్షాటనకు పాల్పడుతున్నట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఇలా వచ్చిన వేలాదిమంది పాక్ బిచ్చగాళ్లను ఇప్పటికే వారి స్వదేశానికి పంపించింది. దీంతో నేరాలు పెరుగుతున్నాయని గ్రహించిన యూఏఇ సాధారణ పౌరులకు ఇచ్చే వీసాలను నియంత్రిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్లూ, డిప్లొమాటిక్ పాస్ పోర్టులు కలిగిన వారికి మాత్రమే వీసాలు ఇస్తున్నట్లు తెలిసింది.
పాక్ సెనెటర్ సమీనా ముంతాజ్ జెహ్రీ కూడా అతికష్టం మీద కొద్దిమంది పౌరులకే వీసాలు మంజూరవుతున్నాయని తెలిపారు. ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రమోటర్ ఐసామ్ బేగ్ మాట్లాడుతూ వర్క్ వీసాలపై కాకుండా టూరిస్ట్ వీసాలపై యూఏఈకి వచ్చిన పాకిస్తానీయులు భిక్షాటనకు పాల్పడటంపై ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. దుబాయ్, అబుదాబి వంటి నగరాలకు ప్రతి సంవత్సరం 8 లక్షలకు పైగా పాకిస్తానీయులు ఉద్యోగం, ప్రయాణం కోసం దరఖాస్తు చేసుకుంటారు. 2024 డిసెంబర్ లో కూడా యూఏఈ, సౌదీ పౌరులకు వీసాలు నిలిపివేశాయి. స్మగ్లింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా, ఇతర నేర కార్యకలా పాలలో పాక్ పౌరులు పట్టుబడటం ఇందుకు కారణం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: