ఢిల్లీలో వాతావరణ కాలుష్యం (Delhi Pollution) ప్రమాదపు అంచుల్లో ఉంది. శీతాకాలంలో ఈ సమస్య మరింత జటిలంగా మారుతుంది. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు వచ్చేందుకు బయపడుతున్నారు. ఇక పిల్లల్ని స్కూలుకు పంపాలంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాము ఇక్కడ బతకలేని వాపోతున్నారు. ఒక్క ఢిల్లీలోనే కాదు, ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ సహా దేశవాప్తంగా పలు నగరాల్లో నెలకొన్న గాలి కాలుష్యంపై చర్చించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పార్లమెంటులో రచ్చ.. రచ్చ
గాలి కాలుష్యంపై కేంద్రానికి ఎలాంటి అప్రమత్తత, ప్రణాళిక, జవాబుదారీతనం లేదని ఆరోపించారు. ఇలాంటి హెల్త్ ఎమర్జెన్సీ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. డిసెంబరు 1న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘నేను కలిసిన ప్రతీ తల్లి ఒకటే మాట చెబుతోంది. నా పిల్లలు విషపూరిత గాలిని పీలుస్తూ పెరుగుతున్నారని, దీనిపై వారంతా అలసిపోయి భయపడుతున్నారు.

హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి, చర్యలు తీసుకోవాలి
భారత పిల్లలు మన ముందే ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ప్రధాన మోదీ ఎలా నిశ్శబ్దంగా ఉండగలుగుతున్నారు? అసలు ప్రభుత్వం ఎందుకు అప్రమత్త, ప్రణాళిక, జవాబుదారీతనం లేదు? అందుకే గాలి కాలుష్యంపై తక్షణమే సమగ్రంగా పార్లమెంట్లో చర్చించాలి. హెల్త్ ఎమర్జెన్సీని కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలి.
మన పిల్లలకు ఎలాంటి సాకులు, అడ్డంకులు లేకుండా స్వచ్ఛమైన గాలి కావాలి’ అని రాహుల్ గాంధీ తన ట్విట్ లో పేర్కొన్నారు. కాగా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సోనియాగాంధీ నివాసంలో ఈ నెల 30న సాయంత్రం 5గంటలకు కాంగ్రెస్ కీలక సమావేశం జరగనున్నది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: