ఆధునిక కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన కారణంగా, చాలా మంది ప్రజలు తమ ఆహారాన్ని వండటానికి మరియు నిల్వ చేయడానికి తిరిగి మట్టిపాత్రలను (Matka Cooking) వాడటానికి మొగ్గు చూపుతున్నారు. మట్టి పాత్రల్లో వండిన ఆహారం ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు, వాటి వాడకంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త మట్టిపాత్రలకు సీజనింగ్ తప్పనిసరి
కొత్తగా కొనుగోలు చేసిన మట్టిపాత్రలను(Matka Cooking) నేరుగా ఉపయోగించకూడదు. వాటిని వాడేముందు తప్పనిసరిగా సీజనింగ్ చేయాలి. ఈ ప్రక్రియలో భాగంగా:
- ముందుగా మట్టిపాత్రను రోజంతా నీళ్లలో బాగా నానబెట్టాలి.
- ఆ తర్వాత దానిని పూర్తిగా ఆరనిచ్చి, పాత్ర లోపల, బయట నూనెను పూర్తిగా రాయాలి.
- నూనె రాసిన తర్వాత కూడా కొంత సమయం పాటు దానిని ఆరనివ్వాలి.
- వంట చేసేటప్పుడు కుండను చిన్న సెగ మీద ఉంచి, ఆ తర్వాతే క్రమంగా మంటను పెంచుతూ వంట మొదలుపెట్టాలి.
మట్టి పాత్రల్లో వండిన లేదా నిల్వ చేసిన ఆహారం చాలా సేపు వేడిగా ఉంటుందనే అదనపు ప్రయోజనం కూడా ఉంది.
శుభ్రపరిచే పద్ధతులు
మట్టి పాత్రలను శుభ్రం చేయడానికి రసాయనాలు కలిపిన సబ్బులు లేదా డిటర్జెంట్లకు బదులుగా సహజమైన పదార్థాలను ఉపయోగించాలి. వీటిని క్లీన్ చేయడానికి ఇసుక, సున్నిపిండి, బూడిద లేదా కుంకుడు రసం వంటి వాటిని వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సహజ పద్ధతులు పాత్రలో రసాయనాలు నిల్వ ఉండకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: