हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: AP: ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రక్షాళనకు కమిటీ :సత్యకుమార్ యాదవ్

Saritha
Latest news: AP: ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రక్షాళనకు కమిటీ :సత్యకుమార్ యాదవ్

విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగులు,(AP) పింఛనుదారులు మరియు వారి కుటుంబ సభ్యుల ప్రయోజనం కోసం అమలవుతున్న ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్స్ స్కీం( ఇహెచ్ఎస్) నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, లోపాలను గుర్తించి తగు పరిష్కార మార్గాలను సూచించడానికి ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై గతనెలలో ఉద్యోగ సంఘాలకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఇచ్చిన హామీ మేరకు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం కమిటీని ఏర్పాటు చేశారు. ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి కొన్ని సమస్యల్ని ఉద్యోగ సంఘాల నాయకులు గతనెలలో మంత్రుల కమిటీ మరియు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో ప్రస్తావి ంచారు. వారు లేవనెత్తిన అంశాల పరిష్కారం దిశగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని గతనెల 185 ముఖ్యమంత్రి ప్రకటించారు. తదనుగుణంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం కమిటీ కూర్పుపై నిర్ణయం తీసుకున్నారు.

Read also: ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఆరోగ్య పరిస్థితి విషయం

AP
Committee to review government employees’ health scheme: Satyakumar Yadav

ఇహెచ్ఎస్ పథకానికి 8 వారాల సమీక్ష కమిటీ

రాష్ట్రప్రభుత్వ(AP) ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేతృత్వం వహించే ఈ కమిటీలో జిఎడి విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి, వ్యయ విభాగం కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ముఖ్యకార్యనిర్వహణాధికారి, ఉద్యోగ సంఘాల ఇద్దరు ప్రతినిధులు ఉంటారు. ఈ కమిటీ 8 వారాల్లో ఇహెచ్ఎస్ పటిష్ట అమలుపై నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన ఇహెచ్ఎస్ పథకంలో మొత్తం 23, 58,858 లబ్దిదారులున్నారు. వీరిలో 5,53,182 మంది ఉద్యోగులు, 2,29,964 మంది పింఛను దారులు, 81,748 మంది కుటుంబ పింఛను దారులతో పాటు వారి కుటుంబ సభ్యులున్నారు. ఈ పథకంపై అయ్యే ఖర్చులో ప్రభుత్వం లబ్దిదారులు చెరి సగం భరిస్తారు. సాలీనా దాదాపు రూ.350 కోట్ల మేర ఖర్చవుతోంది.

గత నెలలో మంత్రుల బృందం మరియు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలు: వైద్య సేవలకోసం చేసిన ఖర్చును సకాలంలో చెల్లించకపోవడం, వివిధ వ్యాధుల ప్యాకేజీ ధరలను పెంచకపోవడం, ఇహెచ్ఎస్ కింద సేవలందించడానికి ఆసుపత్రుల నిరాసక్తత, పర్యవేక్షణ లోపం మరియు ఫిర్యాదుల పరిష్కారం జరగకపోవడం, ఇహెచ్ఎస్ అమలుకోసం వినియోగిస్తున్న ఆన్లైన్ పోర్టల్ పరిమిత సామర్థం మొదలైనవి. ఇహెచ్ఎస్ పథకం అమలులో లబ్దిదారుల అనుభవాలు, సమస్యలు, లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కార మార్గాలపై 8 వారాల్లో నివేదిక సమర్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870