ఏలూరు : నూజివీడు మండలం, నూజివీడు(AP) యంపిడివో కార్యాలయ ప్రాంగణం లో గురువారం రూ 20 లక్షలుతో ఆధునికరించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయ ప్రారంభోత్సవం, రూ 25 లక్షలుతో సమావేశ మందిరంకు శంకుస్థాపన, రూ 3.50 లక్షలతో నియోజకవర్గ అబివృద్ధి ప్రణాళిక కార్యాలయం ప్రారంభోత్సవాలకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక కార్యాలయంలో ఆంధ్ర 2047 యాక్షన్ ప్లాన్, ప్రజా ధర్బార్ పిజిఆర్ యస్ అర్జీలుపై సంబంధిత అధికారులతో మంత్రి కొలుసు పార్థసారథి సుదీర్ఘంగా సమీక్షి ంచారు. ఈ సంద ర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న “స్వర్ణ ఆంధ్ర 2047” అనే ప్రభుత్వ దార్శనికతను అమలు చెయ్యడానికి ఉద్దేశించిన ప్రణాళిక అన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో “విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్” కార్యాలయాలను ఏర్పాటు చేశామని, ఈ ప్రణాళిక ఆర్థికాభివృద్ధి, పర్యావరణ స్థిరత్వం, సామాజిక పురోగతి మరియు సుపరిపాలన వంటి వాటిపై దృష్టి సారిస్తుందని తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు పెంచడం ప్రధాన లక్ష అన్నారు.
Read also: అవమానకర ఉద్యోగ హోదాలకు స్వస్తి: ప్రభుత్వ ఉత్తర్వులు

ప్రజా ధర్బార్‌లో ఆర్జీల త్వరిత పరిష్కారం పై మంత్రి కొలుసు పార్థసారథి
నియోజకవర్గ(AP) స్థాయిలో అమలును పర్యవేక్షి ంచడానికి మరియు పురోగతిని ట్రాక్ చేయడానికి “విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్” లను ఏర్పాటు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలతో సమన్వయం చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధిని సాధించడం జరుగు తుందన్నారు. రాబోయే తరాలు వారికి జీవన ప్రమాణాలు విద్య,(Education) వైద్యం, స్కిల్ డెవలప్మెంటు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించడానికి ముందుగానే ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. వ్యవసాయం, త్రాగునీరు, సాగునీరు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. మన భూములు ప్రాణపదంగా చూసుకుంటామని ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటేనే మనకు ఉపయోగ పడతాయని అన్నారు. వారం వారం ప్రజా ధర్బార్ నిర్వహిస్తామని, ప్రజలు నుండి వచ్చిన ప్రతి అర్జీకి నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. 60 రోజులు దాటినను పరిష్కారం కాకపోతే నేను స్వయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కారం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమాలలో జెడ్పీ సీఈవో యం.శ్రీహరి, డియల్డివో పి. వెంకట రత్నం, తహశీల్దారు జి.బద్రు, యంపిడివో సి. హెచ్. రాఘవేంద్ర నాథ్, వివిధ శాఖలు అధికారులు, పట్టణ ప్రముఖులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: