దివ్యాంగులపై జరుగుతున్న వేధింపులు, వివక్షలను నిరోధించడానికి ఎస్సీ/ఎస్టీ చట్టం తరహాలోనే కఠినమైన ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు( Supreme Court) కేంద్ర ప్రభుత్వాన్ని సూచించింది. యూట్యూబర్లు, హాస్యనటులు తమ వేదికలపై దివ్యాంగులను కించపరిచినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి కూడా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
Read Also: TG High Court: రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హాస్యనటులకు కీలక ఆదేశాలు: నిధుల సేకరణ

ఈ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ప్రముఖులు – హాస్యనటులు సమయ్ రైనా, రణ్‌వీర్ అలహాబాదియా సహా విపుల్ గోయల్, సోనాలి థక్కర్, నిశాంత్ తన్వర్, బల్‌రాజ్ ఘాయ్ – తమ ఆన్‌లైన్ వేదికలపై దివ్యాంగుల విజయగాథలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని కోర్టు(Supreme Court) ఆదేశించింది. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చే నిధులను దివ్యాంగుల చికిత్స, సహాయం కోసం వినియోగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో, ఈ హాస్యనటులు తమ షోలో స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులను, ఇతర దివ్యాంగులను హేళన చేశారని ఆరోపించారు.
‘శిక్ష కాదు, సామాజిక భారం’
ఈ ఆదేశాలను కోర్టు శిక్షగా కాకుండా, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారిపై ‘సామాజిక భారం’ మోపుతున్నట్లు పేర్కొంది. “మీరు ఇంత ప్రజాదరణ పొందినప్పుడు, దాన్ని ఇతరులతో పంచుకోవాలి. మీరు సమాజంలో మంచి స్థితిలో ఉన్నారని గుర్తుంచుకోండి” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మొదట్లో సమయ్ రైనా తన పుట్టినరోజు సందర్భంగా ఇతర హాస్యనటుల తరపున క్షమాపణలు చెప్పగా, మే 5న ధర్మాసనం ఆదేశాల మేరకు వారు యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బేషరతు క్షమాపణలు చెప్పారు. తదుపరి విచారణకు ముందే ఈ నిధుల సేకరణ కార్యక్రమాలను నిర్వహిస్తారని తాము ఆశిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: