విజయవాడ : గౌరవప్రదమైన హోదా పేర్లు సూచించాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రస్తుత కాలానికి అనుగుణంగా లేని… అవమానకరంగా, విపక్ష చూపేలా ఉన్న ఉద్యోగుల హోదాల పేర్లు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు ఉన్న ఉద్యోగుల హోదాల పేర్లు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఫజట్టర్, చౌకీదార్, మసాల్చి, స్కావెంజర్, స్వీపర్ కంచౌకీదార్, హెల్పర్, అటెండర్, ప్లంబర్, ట్రైనర్, క్లీనర్, బట్లర్, దోభీ, మాలి, గేట్ కీపర్, ప్యాకర్, బోయ్, జూనియర్ వాచ్మెన్, హెడ్ యానిమల్ కీపర్, బ్లాక్ స్మిగ్, బుకింగ్ క్లర్క్, లేబరర్ తదితర పేర్లు ఉన్నాయి.
Read also: TTD: శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందా?..ఇందులో నిజమెంతా!

End to humiliating job titles
2018 ప్రకారం
ఉద్యోగుల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా పేర్లు మార్చాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి అందరికి గౌరవంగా జీవించే హక్కు ఉన్నందున, ప్రభుత్వ నియామకాల్లో ఇలాంటి పేర్లను కొనసాగించడం రాజ్యాంగ విలువలకు, ఆధునిక పరిపాలన సూత్రాలకు విరుద్ధమని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకను గుణంగా గౌరవప్రదమైన కొత్త హోదా పేర్లు సూచిస్తూ వారం రోజుల్లో సంబంధిత శాఖలు పంపాలని పేర్కొంది. అన్ని శాఖల ప్రతిపాదనలు క్రోడీకరించి రాష్రప్రభుత్వ బిజినెస్ రూల్స్ 2018 ప్రకారం మొత్తం పేర్ల మారుప ప్రక్రియను, నాలుగు వారాల్లో పూర్తి చేయాలని సిఎస్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: