బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2 (Akhanda 2) పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న సినిమా (Akhanda 2) రిలీజ్ కానుండగా, మూవీ టీం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇవాళ, కూకట్‌పల్లిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈవెంట్ కారణంగా శుక్రవారం కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు.
Read Also: Mangli: సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్
నవంబర్ 28, శుక్రవారం సాయంత్రం కైతలాపూర్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుండటంతో వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కైతలాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా జనసమ్మర్దం ఉంటుందని, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. మూసాపేట్ వైపు నుంచి భరత్‌నగర్, ఎర్రగడ్డ మీదుగా వచ్చే వాహనాలను కూకట్పల్లి Y జంక్షన్ వైపు మళ్లిస్తారు. కూకట్పల్లి Y జంక్షన్ నుంచి ఐడీఎల్ లేక్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అశోకా వన్ మాల్ వద్ద జేఎన్టీయూ రోడ్డులోకి పంపిస్తారు.
మాదాపూర్, హైటెక్ సిటీల నుంచి కైతలాపూర్ వైపు వచ్చే వాహనాలను యశోద హాస్పిటల్ వద్ద నెక్సస్ మాల్, జేఎన్టీయూ వైపు మళ్లిస్తారు. ఈవెంట్ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: