ఇంద్రకీలాద్రి: దుర్గమ్మవారి ఆలయంలో జరగబోయే భవానీ దీక్షల(Vijayawada) మాల విరమణల ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మి, సిపి రాజశేఖర్ బాబు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆటోక్యాడ్ ద్వారా రూపొందించిన మ్యాప్ ద్వారా ఇఓ వికె శీనా నాయక్ కలెక్టర్, సిపిలకు ఏర్పాట్లను, రూట్ మ్యాప్‌ను వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఇంజనీర్లు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Read also: మెట్రో రైలు.. ఎనిమిదేళ్ల ప్రగతికి ప్రతీక!

దుర్గమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
నిత్యాన్నదాన(Vijayawada) పథకానికి విరాళాలు దుర్గమ్మవారి ఆలయం లో నిత్యాన్నదాన పథకానికి రు.1,01,116ల విరాళం గురువారం హైదరాబాద్‌కు(Hyderabad)చెందిన సాత్విక్, సంహిత దంపతులు అందించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన ఎం నారాయణస్వామి పేరిట వారి కుటుంబభ్యులు విరాళంగా రు.1,01,116లను అందించారు. దాతలకు దుర్గమ్మవారి దర్శనం ఏర్పాటు చేసి, దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు. వేదపండితులు వేదాశీర్వచనాల ందించారు. – వెబ్సైట్ ద్వారానే సేవాదారుల రిజిస్ట్రేన్లు :ఇకనుండి దుర్గమ్మవారి ఆలయంలో సేవలను సేవాదారులు హెచ్ టిటిపిఎస్ // దుర్గమల్లేశ్వరస్వామి. కాం/రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారానే సేవలను నిర్వహిస్తామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: