ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. డిసెంబర్ 14 నుంచి ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Minister Savita) వెల్లడించారు.
Read Also: CM Chandrababu: రైతులతో చంద్రబాబు సమావేశం

మహిళలకు 34% రిజర్వేషన్లు అమలుచేస్తాం
‘వంద మందికి శిక్షణిచ్చేలా BC భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నాం. వైట్ రేషన్ కార్డున్నవారు అర్హులు. DEC 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 7న అర్హత పరీక్ష, 11న ఫలితాలు వెల్లడిస్తారు. 100 సీట్లలో BCలకు 66, SCలకు 20, STలకు 14 సీట్లు కేటాయిస్తున్నాం. మహిళలకు 34% రిజర్వేషన్లు అమలుచేస్తాం’ అని (Minister Savita) తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: