ప్లాస్టిక్‌లో ఉండే ఫ్తాలేట్ రసాయనాలు గుండె (Heart) ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తాజా అంతర్జాతీయ పరిశోధన వెల్లడించింది. ఇవి ఆహారం, నీరు, గాలి, సౌందర్య ఉత్పత్తుల ద్వారా శరీరంలోకి చేరి హార్మోన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. రక్తనాళాల్లో వాపు, గట్టి పడటం వంటి సమస్యలు పెరిగి గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదం పెరుగుతుందని అధ్యయనం స్పష్టం చేసింది. భారత్‌లో సంవత్సరానికి లక్షకు పైగా గుండె సంబంధిత మరణాలకు ఈ రసాయనాలే కారణమని నివేదిక పేర్కొంది.
Read also: Health Benefits:పెరుగు, చక్కెర కలిపి ఎందుకు తింటారు?

The use of plastic is seriously damaging the heart
ఎవరికెక్కువ ప్రమాదం & ఎలా జాగ్రత్తపడాలి?
పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఫ్తాలేట్ల ప్రభావానికి ఎక్కువగా గురయ్యే వర్గాలు అని నిపుణులు చెబుతున్నారు. అధిక జనాభా, పరిశ్రమలున్న దక్షిణాసియా దేశాల్లో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని వేసి మైక్రోవేవ్‌లో వేడి చేయడం పూర్తిగా మానుకోవాలి. అలాగే ఫ్తాలేట్-ఫ్రీ ఉత్పత్తులు ఎంచుకోవాలని, ప్రభుత్వాలు ప్లాస్టిక్‌పై కఠిన నియంత్రణలు తీసుకురావాలని పరిశోధకులు సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: