క్రీడలు శారీరక పెరుగుదలకు మనోవికాసానికి ఉల్లా సానికి ఉత్సాహానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. పూర్వకాలం నుండే బోధన అభ్యసనతో పాటు ఆటల పోటీలు నిర్విరామంగా కొనసాగుతూ వస్తున్నాయి. అయినప్పటికీ క్రీడల్లో రాణించడం వల్ల ఎలాంటి ప్రయో జనాలు ఉంటాయో అనే సంశయం చాలామందిలో లేక పోలేదు. ఆటల్లో రాణించే వారికి చదువుల్లో ఎంతో కొంత ఇబ్బంది ఉంటుందనే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఆటల వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా చదువు లపై శ్రద్ధ వహిస్తే ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉంటాయ నే అపోహలు ఉన్నవారు క్రీడ (Sports)లో పాల్గొనడానికి వెనుకంజ వేస్తున్నారు కానీ ఆటలు వీక్షించడానికి ఆసక్తి కనబరిచే వారే అధికంగా ఉండడం విశేషం. దేశంలో అన్ని రకాల క్రీడ (Sports)ల్లో పాల్గొనే క్రీడాకారులకు అభిమానులు అధికంగానే ఉంటున్నారు. ఆధునిక సాంకేతిక నాగరిక ప్రపంచంలో వివిధ క్రీడలకు మరింత ఆదరణ పెరగాల్సిన అవసరం ఉంది. చదివే పరమార్థం అనుకునే వారు ఆటల పట్ల ఆసక్తి చూపడం అనేది చాలా తక్కువే అయినా, చదువుతూ కూడా జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో గొప్పగా రాణించిన వ్యక్తులు దేశంలో లేకపోలేదు. ప్రతిభగల క్రీడా శిక్షకుల మార్గదర్శకత్వంతో జాతీయ అంతర్జాతీయ స్థాయి లో వివిధ క్రీడాంశాల్లో అనేక మంది ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగి దేశానికి కీర్తిని తీసుకువస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న క్రీడాకారులు దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక మంది ఉన్నారు. అలాంటి వారికి ప్రభుత్వాలు అత్యుత్తమ పురస్కారాలతో సత్కరించడంతోపాటు ప్రభుత్వ శాఖల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలను కల్పిస్తుండడం విశేషం.
Read Also: http://Kurnool Sports: క్రీడల అభివృద్ధికి సహకరించండి: రాష్ట్ర మంత్రి టిజి భరత్

దేశం ఉనికిని ప్రపంచవ్యాప్తం
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు క్రీడాంశాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారి కోసం పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కింద ప్రభుత్వ సంస్థల్లో కూడా ప్రత్యేకంగా స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అవుతు న్నాయి. అంతేకాకుండా రాష్ట్రాలలో అత్యున్నతమైన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా స్పోర్ట్స్ రిజర్వేషన్ శాతం ఉంటుంది. నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒలంపిక్స్ నుండి మొద లుకొని ఆసియా క్రీడలు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో క్రీడాకారులు పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తూ ప్రోత్సాహ కాలు అందిస్తున్నాయి. రాష్ర్టస్థాయిలో స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారుల సంక్షేమానికి అభివృద్ధికి చేయూత ఇస్తూ వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా కృషి చేస్తున్నాయి. అంతర్జాతీయ దేశంఉనికిని ప్రపంచవ్యాప్తం జాతీయ క్రీడాకారులను తయారు చేయడానికి ఆటల్లో అనుభవజ్ఞులైన వారితో శిక్షణను అందిస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడల్లో క్రీడాకారుల సామర్ధ్యాలు చేస్తాయి. దేశంలో చాలా వరకు అథ్లెటిక్స్ సాంప్రదాయ క్రీడలు కబడ్డీ, కోకో, బ్యా డ్మింటన్ లాంటి వాటితో పాటు ప్రజాదరణ పొందిన హాకీ, క్రికెట్ ఫుట్బాల్ లాంటి ఆటల్లో అత్యున్నత స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను తయారు చేసే విధంగా ప్రత్యేక స్పోర్ట్స్ స్కూల్స్ తో పాటు జాతీయ అంతర్జాతీయ ఆటలకు కేంద్రంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో క్రీడా ప్రాంగణాలు వేదికగా ఉంటున్నాయి.
ఉన్నతమైన హోదా
ఉభయ తెలుగు రాష్ట్రా ల్లో కూడా అత్యధికంగా అనేక క్రీడాంశాల్లో నైపుణ్యాలను కనబరిచే క్రీడాకారులు లేకపోలేదు. భారత యోజన వ్యవ హారాల మంత్రిత్వ శాఖ వివిధ క్రీడల్లో క్రీడాకారుల నైపుణ్య సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన శిక్షణను ఇస్తూ జాతీయ అంతర్జాతీయ క్రీడల పోటీలకు క్రీడాకారు లను సన్నద్ధం చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వాలు వివిధ క్రీడా అంశాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అత్యుత్తమ పురస్కారాలు అందిస్తున్నాయి. ఉన్నతమైన హోదా కలిగినటువంటి ఉద్యోగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద భర్తీ చేస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల స్థాయిలోనే క్రీడా వ్యవస్థను అభివృద్ధి పరిచే విధంగా విద్యార్థులు వివిధ రకాల ఆటల పట్ల ఆసక్తి చూపేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు విశాలమైన ఆట స్థలాలతోపాటు పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్లను నియ మించడం జరుగుతుంది. కావలసిన క్రీడా సామాగ్రిని కొనుగోలుకు ప్రత్యేక బడ్జెట్ని కేటాయిస్తుంటారు. పాఠశాల లో తరగతి గదికి పరిమితమే కాకుండా క్రీడలపట్ల ఆసక్తి ఉన్నవారికి కూడా ‘మంచి భవిష్యత్తు ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నా చదువులతో పాటు క్రీడలపై విద్యార్థులకు ఆసక్తి పెంచడమే కాకుండా అత్యుత్తమ క్రీడాకారులను రూపొందిం చే విధంగా ప్రభుత్వాలు క్రీడల కొరకు ప్రత్యేకమైన బడ్జెట్ ని కేటాయిస్తూ స్పోర్ట్స్్క అత్యంత ప్రాధాన్యతను ఇస్తుండ డం విశేషం. రాష్ట్రస్థాయిలో జాతీయ, అంతర్జాతీయస్థాయి లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఉపాధి అవకాశాలకు కొదవలేదు. బ్యాంకింగ్ రంగం, ఎయిర్ ఫోర్స్, రైల్వేలు, పోలీస్ శాఖ, ఆర్మీ తదితర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు క్రీడాకారులకు ప్రత్యేకంగా కల్పిస్తున్నాయి.

ప్రత్యేక ఆదరణ
క్రీడలు పురాతన కాలం నుండి ప్రత్యేక ఆదరణ పొందుతున్నాయి. జాతీయ అంతర్జాతీయంగా దేశభక్తిని ప్రతిబింబించేలా చేయడమే కాకుండా దేశ సమైక్యత, జాతీయ వాదాన్ని బలపరుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రజాదారణ పొం దిన క్రీడాకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండటం ఒక ఎత్తు అయితే దేశంలో క్షేత్రస్థాయిలో కొన్నిసార్లు అనుకోని రీతిలో చట్ట సభల్లో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు క్రీడలకు అత్యం త ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారునికి పోలీస్ శాఖ ఉద్యోగంలో అత్యున్నత మైన హోదా కలిగిన ప్రభుత్వ ఉద్యోగాన్నికల్పించింది. రాజకీ యంగా మాజీ క్రికెటర్ కెప్టెన్కు స్వతహాగా ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇవ్వడం కూడా క్రీడాకారుల ఔన్నత్యా న్ని పెంచే విధంగా ఉండడమే కాకుండా ప్రభుత్వాలు క్రీడ లపై అందిస్తున్న ప్రోత్సహం క్రీడల పట్ల క్రీడాకారులకు ఆసక్తి పెరిగేందుకు ఆస్కారం ఉంటుందేమో. ఏది ఏమైనా ఆధునిక సాంకేతిక నాగరిక ప్రపంచంలోభావితరాలకు వివిధ క్రీడలపై అవగాహనతో పాటు క్రీడాకారులకు మరింత ఆద రణ పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
-దాడిశెట్టి శ్యామ్ కుమార్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: