నెల్లూరు క్రైమ్ : బిల్లులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న సిగరెట్ (Cigarette) ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లను నెల్లూరు విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నెల్లూరు సిటీలోని జేమ్స్ గార్డెన్, వెంకట్రామాపురం రెండవ వీధిలోని ఓ పార్సెల్ సర్వీస్ నందు అక్రమంగా బిల్లులు లేకుండా సిగరెట్లు, పాన్ మసాలాలు రవాణా అవుతున్నాయని నమ్మదగ్గ సమాచారం మేరకు బుధవారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రాష్ట్ర బిళీగి అధికారులు కలిసి సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి సోదాలు జరిపారు.
Read also: Goa: గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ఎపి శకటం

Cigarettes without bills seized – Goods worth Rs. 20 lakh seized
24 బాక్సుల సిగరెట్స్
అనుమానాస్పదంగా వున్న 27 కార్టన్ బాక్సులను గుర్తించి తనిఖీ చేయగా అందులో 24 బాక్సుల సిగరెట్స్ 3 బాక్సుల పాన్ మసాలా ప్యాకెట్లు ఉన్నాయి. ట్రాన్స్ ఫోర్ట్ సర్వీస్ వారిని బిల్లులు చూపించమని కోరగా వారు ఎటువంటి బిల్లులు లేవని తెలిపారు. వెంటనే అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు నిమిత్తం జీఎస్టీ కార్యాలయానికి తరలించారు. సరుకు మొత్తం విలువ సుమారు రూ. 20 లక్షలుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ నరసింహారావు, డిసిటిఓలు విష్ణు, సుబ్బారావులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: