కడప(kadapa) జిల్లాలో అరటి రైతుల పేరుతో మళ్లీ అబద్ధాల ప్రచారం ప్రారంభించిన జగన్ తీరు ప్రజలను మోసం చేసే మరో ప్రయత్నమే తప్ప వాస్తవాలతో ఎలాంటి సంబంధంలేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) అన్నారు. ఐదేళ్ల పాటు వ్యవసాయ రంగాన్ని అధ్వాన్న స్థితికి నెట్టిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కామెడీగా ఉందన్నారు. జగన్ పాలనలోనే రైతులు వీధులపైకి వచ్చారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఏమిటో ఆయన ప్రభుత్వానికి తెలియదు.
రైతులను ఆదుకోవాల్సిన ఆర్బీకేలను లంచాల గూళ్లుగా మార్చి అరటి(Banana), టమోటా(Tomato), ఉల్లి వంటి పంటలను నేలమట్టం చేసిన ప్రభుత్వం జగన్‌దే అని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టుకుని, ఎంత క్షోభకుగురయ్యారన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలని అన్నారు. ఎగుమతుల పేరుతో జగన్ చెబుతున్న సంఖ్యలన్నీ వంద శాతం అబద్ధం. తన హయాంలో 3 లక్షల టన్నులు ఎగుమతి చేశామని చెప్పడం పూర్తిగా కల్పితం.
Read Also: Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేష్

ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు
కేంద్రం నుంచి అవార్డులు తీసుకువచ్చామన్న మాటకే ఎలాంటి రికార్డు లేదు. ఇదంతా జగన్ ప్రచార బృందం తయారు చేసిన అబద్ధాల మేళా మాత్రమే అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2020-25 ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ(Food Processing Policy) పరిధికి సంబంధించి మొదటి దశలో 10 యూనిట్ల కోసం ప్రభుత్వం రూ.1250.29 కోట్ల పరిపాలనా ఆమోదం కూడా జారీ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రూ.2,500 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామనేది కూడా పూర్తిగా అవాస్తవమే. పత్రాల్లో మాత్రమే ప్రాజెక్టులు(projects), నేలపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయని ప్రభుత్వం తమ పాలనను గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు.
కూటమి ప్రభుత్వంపై నిందలు మోపే ముందు, ఆయన తన ఐదు సంవత్సరాల పాలనలో రైతులు అనుభవించిన నష్టాలను ఒకసారి వెనక్కి చూసుకో వాలి. ఈ ఏడాది రాయలసీమలో కడప,
నంద్యాల, అనంతపురం జిల్లాలలో మొత్తం 40,000 హెక్టార్లలో అరటి సాగు జరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. రైతులు(Farmers) ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకొని సాగు విస్తరిం చారు. ధరలు తగ్గడానికి కారణాలు అధిక వర్షాల వల్ల నాణ్యత తగ్గడం, ఉత్తరాది రాష్ట్రాలలో సాగు విస్తరణ, రెండో కోతపంట ఎగుమతులకు అనువు గాకపోవడం వంటి సహజ మార్కెట్ పరిస్థితులు. కానీ జగన్ ఇవన్నింటిని దాటికి పూర్తిగా రాజకీయ దాడులు చేయడం రైతులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడమే.

పంటనాణ్యత సమస్యల వల్ల ఎగుమతు
ప్రస్తుతం ఉత్తమ నాణ్యత గల అరటికాయకు కిలో రూ.7.50 నుండి రూ.8.00వరకు ధర రావడం, నాణ్యతలేని పంట టన్నుకు రూ.3,000 నుండి రూ.8,000 మధ్య పడటం సహజమే. రెండో కోతలో ఉన్న 17,000 హెక్టార్లలో పంటనాణ్యత సమస్యల వల్ల ఎగుమతు లకు అనుకూలంగాలేదు. అయినా కూడా ప్రభుత్వం రైతులకు మంచి ధర కల్పించేం దుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు జగన్ చెబుతున్న మా హయాంలో 3 లక్షల టన్నులు ఎగుమతి చేశాం వంటి గణాంకాలు పూర్తిగా అబద్ధం. ప్రస్తుతం గడచిన రెండు నెలల్లో రోజుకు 700-800 టన్నులే ఎగుమతి అవుతున్నాయి. కేంద్రం నుంచి అవార్డులు తీసుకొచ్చామన్న మాటలకు ఎటువంటి రికార్డులు లేవు. బహిరంగ మార్కెట్ లో రులు లేవు. అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉన్న పంటలకు ధర పెరిగితే మా వలనే పెరిగిందని మాట్లాడుతున్న అవగాహన లేని మాజీ సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు.
రైతులు తీవ్ర నష్టాలు
గత ప్రభుత్వ పాలనలో ఖరీఫ్ 2019 తర్వాత స్వంత బీమా సంస్థతో పంట బీమా అమలు చేయాలనుకున్న ప్రయత్నం విఫలమై, రబీ 2018-19 తర్వాత ఏ రబీ సీజన్ కూ బీమా పరిహారం చెల్లించకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత పథకాల సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణ కోసం వ్యవసాయ, ఆర్థిక, పౌర సరఫరాల మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, ఖరీఫ్ 2024లో ఈపంట ఆధారంగా ఉచిత పంట బీమాను అమలు చేయడంతో పాటు రబీ 2024-25 నుంచి స్వచ్చంద నమోదు విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు సహాయపడేందుకు బలమైన చర్యలు చేపట్టింది.
రాష్ట్ర ఉద్యాన శాఖ ‘ఫ్రూట్ కేర్(Fruit Care)’ యాక్టివిటీ చేపడుతున్న ప్రతి రైతుకు ఎకరాకు రూ.10,000/ చొప్పున రాయితీ ప్రోత్సాహకాలు అందిస్తోంది. నాణ్యమైన పంట పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తోంది. ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ స్వయంగా అనంతపురం, నంద్యాల, కడప జిల్లాలలో పర్యటించి పంట పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ ప్రతినిధులు ఢీల్లీలో బయ్యర్ అండ్ సెల్లర్స్ మీట్నిర్వహించి దేశంలోని ప్రధాన మార్కెట్లతో ప్రత్యక్ష చర్చలు జరిపారు. ఆజాద్‌పూర్ మండి, హర్యానా సోనిపట్ అగ్రిగేటర్లతో జరిగిన సమావేశాల్లో వచ్చే 10-15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలు ప్రారంభమవుతుందని కొనుగోలుదారులు హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: