విజయవాడ: బాధ్యతలు గుర్తించి ముందుకు సాగాలి భారత రాజ్యాంగ దినోత్సవంలో మంత్రి లోకేష్ (Nara Lokesh) విద్యార్థులు భవిష్యత్ రాజకీయాల్లో కీలకపాత్ర వహించి, సమాజంలో మార్పు తీసుకురావాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులచే నిర్వహించిన నమూనా అసెంబ్లీ కార్యక్రమాన్ని తిలకించారు.
Read also: Police Jobs : పోలీస్ శాఖలో 11,639 ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

Students should enter politics
పిల్లలకు చిన్న వయసులోనే
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… యువగళం పాదయాత్ర సమయంలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగాను. పాదయాత్ర సమయంలో నన్ను అడ్డుకున్న పోలీసులకు ఆర్టికల్ 19లో పొందుపర్చిన రైట్ టు ఫ్రీడమ్ గురించి చెప్పాను. వారు అదంతా మాకు తెలీదు, ఎస్పీతో మాట్లాడమని చెప్పేవారు. పిల్లలకు చిన్న వయసులోనే రాజ్యాంగ హక్కులు, బాధ్యతల గురించి తెలియజేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. నేను స్టాన్ ఫోర్డ్ ప్రవేశపరీక్ష సందర్భంగా రాసిన వ్యాసంలో ప్రజాసేవ, పాజిటివ్ లీడర్ షిప్ తో సమాజంలో మార్పువస్తుందని రాశాను. మీరు భవిష్యత్తులో ఏ వృత్తిలోకి వెళ్లినా నైతికతను వీడొద్దు. రాజకీయాల్లో పాజిటివ్ లీడర్ షిప్ తేవడానికి కృషిచేయండి.
175 నియోజకవర్గాల్లో 7 లక్షల మంది
ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్లినా భారతదేశం, ఆంధ్రప్రదేశకు గర్వకారణంగా నిలబడాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. “రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 7 లక్షల మందితో పోటీపడి మీరంతా ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది. మనసులో ఒకటి సాధించాలి. అనుకున్నపుడు దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలని పోరాడాను. ఈ రోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ. శాసనసభ కార్యకలాపాలన్నీ మీరు ఈరోజు చూశారు. అనేక ప్రశ్నలు, బిల్లులు తెచ్చారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం చేయాలన్నది మన ప్రభుత్వ లక్ష్యం. రైతుల సమస్యలు, పిల్లలు సెల్ ఫోన్ ఎడిక్షన్, యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ పై నమూనా అసెంబ్లీలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు క్రమశిక్షణ, హుందాతనం ముఖ్యం. శాసనసభలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాటిని అదుపు చేసుకున్నపుడే ప్రజాస్వామ్య భాగస్వామ్యం ఏర్పడుతుంది” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: