దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఓడిపోయింది.రెండు టెస్టుల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయి క్లీన్‌స్వీప్‌కు గురైంది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో కూడా భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Read Also: WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ కోసం మెగా వేలం..ఎప్పుడంటే?
(ట్విట్టర్) వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు
ఈ సిరీస్ ఓటమి తర్వాత జట్టు ప్రదర్శన, నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు అభిమానులు కోచ్ గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) జట్టులో ఐక్యతను, పట్టుదలను చాటుతూ స్పందించాడు.
‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు (Shubman Gill).”ప్రశాంతమైన సముద్రాలు నావను ఎలా నడపాలో నేర్పవు. తుపానులే గట్టి చేతులను తయారు చేస్తాయి. మేం ఒకరినొకరు నమ్ముకుంటాం, ఒకరి కోసం ఒకరం పోరాడతాం. మరింత బలంగా పుంజుకుని ముందుకు సాగుతాం” అని గిల్ తన సందేశంలో పేర్కొన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: