हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Telugu News: liquor scam: మద్యం కేసులో సుప్రీమ్ కోర్ట్ కీలక ఆదేశాలు

Tejaswini Y
Telugu News: liquor scam: మద్యం కేసులో సుప్రీమ్ కోర్ట్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న మద్యం(liquor scam) అక్రమాలు కేసులో ఇవాళ మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు ప్రధాన నిందితులకు విజయవాడ(vijayawada) ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ ప్రభుత్వం హైకోర్టు ఆశ్రయించగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాక, నిందితులు సిట్‌ ముందు హాజరవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వెలువడింది.

Read Also: Nara Lokesh: అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు

Supreme Court’s key orders in liquor case

కౌంటర్ పిటిషన్ దాఖలు

వైసీపీ పాలన సమయంలో జరిగినట్లు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంపై సీఐడీ(Criminal Investigation Department) సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను అరెస్టు చేసింది. మద్యం ఉత్పత్తి సంస్థల ద్వారా వచ్చిన అక్రమ ఫండ్స్‌ను ఉన్నత వైసీపీ నాయకులకు చేరవేశారన్న ఆరోపణలపై వీరిపై చర్యలు తీసుకున్నారు. రిమాండ్ అనంతరం దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు(ACB Court) అంగీకరించడంతో ముగ్గురూ విడుదలయ్యారు.

తాజాగా, నిందితులు సిట్‌కు లొంగిపోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సిట్ 10 రోజుల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే నిందితుల తరఫు న్యాయవాదులు రిజాయిండర్ దాఖలు చేసేందుకు అదనంగా 5 రోజులు సమయం కోరారు. దీనితో కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 15కు వాయిదా వేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870