సుస్థిర, శాశ్వత ఉపాధి రంగాలలో పెట్టుబడులు పెరి గితేనే భారత్ లాంటి దేశాలకు ప్రయోజనకరం. కానీ నేడు అందుకు విరుద్ధమైన రీతిలో మనదేశంలో పెట్టుబడుల తీరు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ ఏఐ ప్రభావం విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు ఏఐ వల్ల చాలా మంది నిరుద్యోగులవుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర నివేదిక వెల్లడైంది. భారతదేశంలో దాదాపు సంగం అంటే 47 శాతం కంపెనీలు బహుళ జనరేటివ్ ఏఐని ఉత్ప త్తిలో వినియోగిస్తున్నట్లు ఈవైసీఐఐ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. ‘ది ఏఐడియా ఆఫ్ ఇండియా’ అవుట్ లుక్ 2026′ పేరుతో ఈ నివేదికను రూపొందిం చారు. దీనికోసం 200 భారతీయ సంస్థల ప్రతినిధుల నుంచి అభిపాయాలు సేకరించారు. ఈ క్రమంలో 95శాతం కంటే ఎక్కువసంస్థలు మొత్తం ఐటీ వ్యయంలో 20 శాతం కంటే తక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) బడ్జెట్లను నిర్వహిస్తున్నాయి. ఇక్కడితో ఆగని ఎంతోమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తు న్నట్లుతేలింది. ఆ రంగంలోకి పెట్టుబడుల వరద సాగిస్తు న్నారు. అయితే ఇదెంత వరకు సేఫ్? మన దేశంలో ఈ పరిణామం ఎంత వరకు మేలు చేస్తుందన్నది. ఇప్పుడు చర్చగా మారుతోంది. మన దేశానికి మనవ వనరు భారీ స్థాయిలో ఉంది. అంటే మన దేశంలో యువత సంఖ్య అధి కంగా ఉంది. ఇది ఏ దేశానికైనా పురోగతి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఈ యువతకు పూర్తి స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికినప్పుడే. ఇప్పటికే మన దేశంలో చాలా మంది యువతకు ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో లేవు. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలు పెంచే దిశగా పరిశ్రమల ఏర్పాటు, కార్పొరేట్ కంపెనీ స్థాపన, ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెరగాలి. కానీ తాజాగా తేలిన అధ్యయనంలో ఆందోళనకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది.
Read Also : http://Delhi Air pollution: 50% ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆదేశాలు

ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగల కల్పన కంటే సాంకేతికత కారణంగా ఉద్యోగాలు ఊడిపోతున్న సంఖ్యయే అధికంగాఉంది. ఈ తరుణంలో పెట్టుబడులు ఉపాధి కల్పన రంగా ల్లో జరగాల్సిందిపోయి ఏఐ రంగంలోకి మళ్లడం మన భారత్ లాంటి దేశాలలో ఓ శాపమే. ఏఐ రంగంలో పెట్టుబడులపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏఐ రంగంలో పెట్టుబడులు పెడితే ఆశించినంత రాబడులు రాని పక్షంలో ఆశలు రేకెత్తిస్తున్న ఈ బుడగ బద్దలయ్యేఅవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఏఐ రంగంలో పెట్టుబడులు ఏ మాత్రం శ్రేయస్కరం కాదన ఏఐ అనేఆశల బుడగ బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదే జరిగితే డాట్కామ్ సంక్షోభం నాటి రోజు లు మళ్లీ వస్తాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏఐ రంగం వైపు పెట్టుబడులు పెరగడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రస్తుతంకంపెనీ మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోవటం. అసాధారణం గా పెరిగిన అంచనాల నేపథ్యంలో నిధులసేకరణ జరగటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ కారణం చేతనే ప్రస్తుతం ఏఐరంగంలో భారీగా పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. అయితే ఇదెంతో కాలం సాగదనిఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ఏమైనా ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టే వారంతా ఆచితూచి అడుగులు వేయటం మంచిదని ఆర్థిక నిపుణుల మాట. ఈపరిస్థితుల నేపథ్యంలోమన దేశ ఆర్థిక వ్యవస్థకు ఏది మంచిది, మన దేశంలో ఉపాధి అవాశాలు పెరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. పెట్టుబడిదారు లను ఏ వైపు ప్రోత్సహించాలి. ఏ రకమైనప్రోత్సాహకాలు అందించి మన దేశంలో ఉపాధి కల్పన రంగాలలో పెట్టు బడులను ప్రోత్సహించాలి అన్నది ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచన చేయాలి.దేశంలోని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పన బాధ్యత ప్రభుత్వానిదే.
-సయ్యద్ నిసార్ అహ్మద్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: