లక్షలు.. కోట్లు డబ్బు ఉన్నంతమాత్రంగా ఆనందంగా జీవించలేం. పడుకునేందుకు పట్టుపరుపులు ఉన్నా సుఖమైన నిద్ర ఉంటుందని అనుకోలేం. కష్టపడ్డ మనసు నేలపైన అయినా హాయిగా నిద్రపోతాడు. కూలిపనిచేసుకున్న కూలీవాడు సైతం ఆనందంగా కడుపునిండా భోజనం చేస్తాడు. కానీ సంపనులుగా ఉన్నవారందరూ సుఖంగా, హ్యాపీగా ఉన్నారనుకోవడం పొరపాటే.
Read Also: Draupadi Murmu: తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
వారికి కన్నీరు ఉంటాయి.. ఆవేదన ఉంటుంది.. ఆ వేదన కొన్నిసార్లు ఆత్మహత్యకు ప్రేరేపించవచ్చు. దీప్తి విషయంలో బహుశా ఇదే జరిగిందేమో.. ప్రముఖ పాన్ మసాలా కంపెనీలైన కమలా పసంద్, (Kamala Pasand owner) రాజశ్రీ పాన్ మసాలా యజమాని కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా ఢిల్లీలోని వసంత విహార్ లోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీప్తి చౌరాసియా కమలా పసంద్ యజమాని కమల్ కిషోర్ కుమారుడు అంకిత్ చౌరాసియా భార్య. మంగళవారం సాయంత్రం దీప్తి చౌరాసియా మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వసంత విహార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంధంలో ప్రేమ లేనప్పుడు జీవించడం ఎందుకు?
పోలీసులకు (police) ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించింది. ఆ నోట్ లో ఆమె ఎవరిపైనా ప్రత్యక్షంగా ఆరోపణలు చేయలేదు. అందులో రాసిన విషయం ఆమె మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. ‘ఒక బంధంలో ప్రేమ, విశ్వాసం లేనప్పుడు ఆ బంధంలో కొనసాగడానికి, జీవించడానికి కారణం ఏమిటి?’ అని రాసి ఉంది. అయితే దీప్తి చౌరాసియ తల్లిదండ్రులు మాత్రం అత్తింటివారిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
దీప్తిని ఆత్మహత్యకు వారు పురికొల్పారని అంటున్నారు. దీప్తి, (Deepti,) కమల్ కిషోర్ కుమారుడు అంకిత్ చౌరాసియా వివాహం 2010లో జరిగింది. అంకిత్ చౌరాసియాకు రెండు వివాహాలు జరిగాయి. ఆయన రెండో భార్య దక్షిణ భారత సినిమాలలో నటి అని సమాచారం. వైవాహిక జీవితంలో నెలకొన్న ఈ సమస్యలే దీప్తి ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: