हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Rishabh Pant: ఓటమిపై పంత్ ఏమన్నారంటే?

Anusha
Latest News: Rishabh Pant: ఓటమిపై పంత్ ఏమన్నారంటే?

టీమిండియా తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) సౌతాఫ్రికా సిరీస్‌ ఘోర పరాజయంపై స్పందించాడు. జట్టుగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకపోవడంతోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నామని పంత్ అన్నాడు. ప్రత్యర్థి తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని చెప్పాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో బుధవారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

Read Also: Sports School: ములుగు జిల్లాలో కొత్త స్పోర్ట్స్ స్కూల్

ఈ విజయంతో సౌతాఫ్రికా 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా వరుసగా రెండో ఏడాది సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. గతేడాది ఇదే సమయంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా.. తొలిసారి సొంతగడ్డపై టీమిండియాను క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషభ్ పంత్ (Rishabh Pant)..

ఈ ఘోర పరాజయం‌ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. సౌతాఫ్రికా తమ కంటే మెరుగ్గా ఆడిందని కొనియాడాడు. ‘ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. జట్టుగా మేం చాలా మెరుగవ్వాలి. మా కంటే బాగా ఆడిన సౌతాఫ్రికా‌కు ఈ గెలుపు దక్కాల్సిందే. సిరీస్ మొత్తం వారు ఆధిపత్యం చెలాయించారు. అయితే క్రికెట్‌ను ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దనే విషయం మరోసారి స్పష్టమైంది.సొంతగడ్డపై ఆడుతున్నామనే అడ్వాంటేజ్ ఉన్నా..

మా సొంత ప్రణాళికపై ఫోకస్ పెట్టడం

కొన్నిసార్లు మ్యాచ్‌లో ముందంజలో నిలిచినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని మరింత మెరుగవ్వాలి. సొంతగడ్డపై ఆడినా.. విదేశాల్లో ఆడినా.. క్రికెట్ ఎప్పుడూ ఆటగాళ్ల నుంచి పట్టుదల, ప్రయత్నాన్ని డిమాండ్ చేస్తుంది. బ్యాటింగ్ విభాగం సమష్టిగా విఫలమైంది.

What did Pant say about the defeat?
What did Pant say about the defeat?

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ సిరీస్‌లో మాకు ఉన్న ఏకైక సానుకూల అంశం ఏంటంటే.. మా సొంత ప్రణాళికపై ఫోకస్ పెట్టడం.’అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. 549 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 27/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌటైంది.

హాఫ్ సెంచరీ

భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్(13), కేఎల్ రాహుల్(6), సాయి సుదర్శన్(14), కుల్దీప్ యాదవ్(5), ధ్రువ్ జురెల్(2), రిషభ్ పంత్(13),

వాషింగ్టన్ సుందర్(16), మహమ్మద్ సిరాజ్(0) తీవ్రంగా నిరాశపర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్(6/37) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, సీనర్ ముత్తుసామి తలో వికెట్ తీసారు.

సంక్షిప్త స్కోర్లు..

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489 ఆలౌట్

భారత్ తొలి ఇన్నింగ్స్ 201 ఆలౌట్

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 260/5 డిక్లేర్డ్

భారత్ రెండో ఇన్నింగ్స్ 140 ఆలౌట్

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870