విజయవాడ: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummadi sandhya rani) ఏపీలో తొలిసారిగా గిరిజన చిన్నారులకు సాంస్కృతిక ఉత్సవాలకు రంగం సిద్ధమవుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఏపీ ఏకలవ్య మోడల్ ఐ రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ సన్నద్ధమయింది. గిరిజన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో నిర్వహించడానికి సమాయత్త మవుతోంది. రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని కేఎల్ యూనివర్శిటీలో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఆమోదించారు. ఉద్భవ్ 2025 పేరుతో నిర్వహించనున్న ఈ సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలలో ప్రతిభ చాటేందుకు 22 రాష్ట్రాలకు చెందిన 405 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి 1644 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
Read also: Women’s rights : మహిళల హక్కుల పట్ల అవగాహన అవసరం

Minister Gummidi Sandhyarani
ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టలను జాతీయ స్థాయంలో
విద్యార్థులతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, సంరక్షకులు, కంటింజెంట్ మేనేజర్స్ మరో 278 మంది హాజరవుతున్నారు. దేశంలోని సాంస్కృతిక, కళా వైవిధ్యం మరియు గిరిజనుల జీవిత ముఖచిత్రాలను ప్రతిబింబించే సంగీతం, సాహిత్యం, నృత్యం, థియేటర్ ఆర్ట్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేయనుంది. వెలగపూడి సచివాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సన్నాహకాల వివరాలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి, గురుకులం కార్యదర్శి ఎం. గౌతమి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి విలేఖరుల సమావేశంలో వివరించారు. ఉద్భవ్2025లో పాల్గొనేందుకు వచ్చే వారికి సదుపాయాల్లో లోటుపాట్లు తలెత్తకుండా రవాణా, వసతి, భోజన ఏర్పాట్లు ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టలను జాతీయ స్థాయంలో ఇనుమడింపజేసేలా పోటీలను నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఉద్భవ్2025 పోస్టర్, లోగోను మంత్రివర్యులు ఆవిష్కరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: