మహారాష్ట్ర(Maharashtra Crime)లోని థానే జిల్లాలో ఒక భయంకరమైన హత్య కేసు బయటపడింది. సహజీవనం చేస్తున్న యువతిని ఒక వ్యక్తి క్రూరంగా హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి కాలువలో పడేశాడు. సూట్‌కేస్ అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు తెరిచి చూడగా మహిళ శవం కనిపించింది.
Read also : Chattisgarh Crime: భార్యాభర్తలు మృతి, లిప్‌స్టిక్‌తో గోడపై సంచలన సందేశం

సీసీటీవీ దృశ్యాలు
దేహంపై ‘P V S’ అని టాటూ(Tattoo) ఉండటం పోలీసులు గుర్తించారు. దీనిని ఆధారంగా తీసుకుని, సమీప సీసీటీవీ దృశ్యాలతో పాటు సోషల్ మీడియా(Social media) సమాచారం చెక్ చేయడంతో మృతురాలు 22 ఏళ్ల ప్రియాంక విశ్వకర్మ అని నిర్ధారణకు వచ్చారు. ఆమెతో ఐదేళ్లుగా కలిసి నివసిస్తున్న 50 ఏళ్ల వినోద్ శ్రీనివాస్ విశ్వకర్మపై అనుమానం ఉంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
పరిశీలనలో, నవంబర్ 21 రాత్రి వారి మధ్య జరిగిన వాగ్వాదంలో కోపంతో ప్రియాంకను గొంతునులిమి చంపినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. మరుసటి రోజంతా శవాన్ని ఇంట్లో దాచిపెట్టిన అతడు, దుర్వాసన రావడంతో నవంబర్ 22 రాత్రి దానిని సూట్‌కేసులో పెట్టి కాలినడకన వెళ్లి వంతెన క్రింద ఉన్న కాలువలో పడేశానని తెలిపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, హత్య మరియు సాక్ష్యాల నాశనం చేయడం తదితర కేసులు నమోదు చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :