ఛత్తీస్‌గఢ్‌లోని( Chattisgarh Crime) బిలాస్‌పూర్ నగరంలోగల అటల్ ఆవాస్ కాలనీలో ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది. శివానీ తాంబే (అలియాస్ నేహా) మరియు ఆమె భర్త రాజ్ తాంబే తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. భార్య మృతదేహం మంచంపై ఉండగా, భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు ఒక ప్రైవేట్ కంపెనీలో క్లీనర్లుగా పనిచేస్తూ, పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
Read Also: Beef Controversy: గోవుల అక్రమ తరలింపుపై పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు
సోమవారం మధ్యాహ్నం వరకు వారు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో, నేహా తల్లి రీనా చిన్నా వారి ఇంటికి వెళ్లింది. తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో బలవంతంగా తెరిచి చూసిన ఆమె, కుమార్తె మరియు అల్లుడు విగతజీవులై కనిపించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
లిప్‌స్టిక్ సందేశాలు, అనుమానాలు
పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా, ఇంట్లోని గోడలపై లిప్‌స్టిక్‌తో రాసి ఉన్న కొన్ని సంచలన సందేశాలు కనిపించాయి. గోడపై “రాజేశ్ విశ్వాస్ వల్లే మేము చనిపోతున్నాం” అని, మరియు అతని పేరు, ఫోన్ నంబర్ స్పష్టంగా రాసి ఉన్నాయి. మరోవైపు, గోడపై “పిల్లలూ.. ఐ లవ్యూ” అనే హృదయాన్ని కదిలించే సందేశం కూడా కనిపించింది.
స్థానికుల సమాచారం ప్రకారం, నేహా ఫోన్ కాల్స్ విషయంలో భర్త రాజ్ తాంబేకు తరచూ అనుమానం( Chattisgarh Crime) పెరిగి, వారి మధ్య నిత్యం గొడవలు జరిగేవని తెలిసింది. నేహా మెడపై గీరుకున్న గాయాలు ఉండటంతో, భర్త రాజ్ తాంబే గొంతు నులిమి భార్యను హత్య చేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. గదిలో లభించిన సూసైడ్ నోట్‌లో కూడా గోడలపై రాసిన ఆరోపణలే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక మరణాలకు కచ్చితమైన కారణం తెలుస్తుందని నగర సీఎస్పీ నిమితేశ్ సింగ్ వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: