భారత రాజ్యాంగాన్ని(National Constitution Day) ఆమోదించిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా, 76వ వార్షికోత్సవం సందర్భంగా నేడు (నవంబర్ 26న) పాత పార్లమెంటు భవనంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించనున్నారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌తో పాటు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Read Also: National Constitution Day: రాజ్యాంగ దినోత్సవం : ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక

ఈ సందర్భంగా, తొలుత రాష్ట్రపతి రాజ్యాంగ పీఠిక (Preamble) ను చదివి వినిపిస్తారు. అనంతరం, రాజ్యాంగాన్ని(National Constitution Day) మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో, తెలుగు, తమిళం, మరాఠీ సహా మొత్తం తొమ్మిది భారతీయ భాషల్లోకి అనువదించిన డిజిటల్ రాజ్యాంగ ప్రతులను విడుదల చేయనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: