గ్రేటర్ హైదరాబాద్లోని విద్యుత్ (current) వ్యవస్థను సమూలంగా మార్చే ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. నగరంలో ప్రస్తుతం ఉన్న ఓవర్హెడ్ విద్యుత్ తీగలను పూర్తిగా భూగర్భ కేబుళ్ల (UG) వ్యవస్థతో మార్చడానికి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అధికారుల అంచనాకు ప్రకారం, ప్రాజెక్టుకు రూ.14,725 కోట్ల వ్యయం పడనుంది.
Read also: GHMCలో 27 మున్సిపాలిటీల విలీనంకు కేబినెట్ ఆమోదం | హైదరాబాద్ పరిధి విస్తరణ…

Goodbye to current wires in Hyderabad.. Now everything is underground
2–3 మీటర్ల లోతులో కేబుళ్లను ఏర్పాటు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) 27,063 కిలోమీటర్ల పొడవు ఉన్న 11 కేవీ ఓవర్హెడ్ లైన్లను దశలవారీగా భూగర్భంలోకి మార్చనుంది. మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని 10 విద్యుత్ సర్కిళ్లలో మొదటగా పనులు ప్రారంభిస్తారు. రోడ్లను తవ్వకుండా, హారిజాంటల్ డ్రిల్లింగ్ పద్ధతిని ఉపయోగించి 2–3 మీటర్ల లోతులో కేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంజనీర్ల బృందం ఇతర నగరాల UG కేబుల్ వ్యవస్థలను అధ్యయనం చేసి ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడానికి డీపీఆర్ కూడా సిద్ధం చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: