రూ. 40 వేల కోట్లతో సీమరైతుల అభివృద్ధికి కార్యాచరణ
విజయవాడ : ప్రపంచంలో (CM Chandrababu)డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల్లో 18 రకాల పంటలు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే పండుతాయని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దీన్ని అందిపుచ్చుకునేలా ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పూర్వోదయ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వోదయ స్కీంలో భాగంగా రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాయల సీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి పెంచేలా కార్యాచరణ రూపొందించారు. పూర్వోదయ స్కీమ్ భాగంగా రహదా రులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీ రోడ్లు లాంటి పనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ.40 వేల కోట్లతో ప్రణాళిక అమలు
చేయనున్నారు. మొత్తం 5.98 లక్షల ఉద్యాన రైతులకు మరింత లబ్ది కలిగేలా ప్రణాళికపై సమీక్షించారు. అలాగే ప్రపంచ బ్యాంకు నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏయే అంశాల్లో దృష్టి సారించాలనే అంశంపై సిఎం చంద్రబాబు చర్చించారు. నీతిఆయోగ్ సిఫార్సులతో ఉమ్మడి రాయల సీమ, ప్రకాశం జిల్లాల పరిధిలోని 9 జిల్లాల్లోని హార్టికల్చర్, రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆర్ అండ్ బి రోడ్లు, పంచాయతీ రాజ్ రోడ్లు వంటి అంశాలపై చర్చించారు.
Read also: 50% ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆదేశాలు

ఉద్యాన పంటలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే వ్యూహం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి (CM Chandrababu) మాట్లాడుతూ ‘రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దటం లక్ష్యంగా పెట్టుకోవాలి. సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. రాయలసీమలో మొత్తంగా 65 రకాల ఉద్యాన పంటలు పండు తుంటే.. డిమాండ్ డ్రివెన్ హార్టికల్చర్ 18 రకాల పంటలకు మంచి డిమాండ్ ఉంది. ఈ రకాల పంట లను పండించేలా ఉద్యాన రైతులను ప్రొత్సహిం చాలి. అప్పుడు సీమలో ఉద్యాన పంటల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం సులువుగా ఉంటుంది. దీనికోసం రైతులకు అవసరమైన మౌలిక సదుపా యాలు కల్పించాలి. రెగ్యులర్ క్రాప్స్ కంటే… భవిష్యత్తులో ప్రజల అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించాల్సి ఉంటుంది. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఉత్పత్తి, టేబుల్ వెరైటీలను పండించి ఆ పంటలకు విలువ జోడించాలి. అప్పుడే రైతులకు ఆర్ధిక ప్రయోజనాలు అందుతాయి. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఈ ఉద్యాన పంటలకు నీటిని అందించాలి. హార్టికల్చర్ జోన్లుగా తీర్చిదిద్ది ప్రోత్సాహకాలు కల్పించాలి.
ఆర్గానిక్ సేద్యం ద్వారా ఉద్యాన పంటలు పండించాలి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉద్యాన పంటలు పండిస్తే అది రైతులకు మేలు కలుగుతుంది. ఆక్వా రంగం తరహాలోనే ఉద్యాన రంగం కూడా భవిష్యత్తులో అగ్రస్థానానికి చేరుతుంది. ఈ 9 జిల్లాల పరిధిలో ప్రస్తుతమున్న 10 రకాల ఉద్యాన పంటలతో పాటు… డిమాండ్ ఉన్న మరో 8 పంటలను కూడా పండించేలా చర్యలు తీసుకోండి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల ద్వారా పెద్ద ఎత్తున రైతులకు ప్రయో జనం కలుగుతుంది. 18 ముఖ్యమైన పంటలను లక్ష్యంగా చేసుకుని వాటికి మంచి సాగు సదుపాయాలు కల్పించటం, రవాణా, లాజిస్టిక్స్, మార్కెటింగ్, కోల్డ్ చైన్లాంటి మోలిక సదుపాయాలుకల్పించాలి. దుబాయ్ లాంటి ప్రాంతాలకు ఎయిర్ కార్గోద్వారా రవాణా చేయగలగాలి. దుబాయ్ నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పండ్లను రవాణా చేసే అవకాశం ఉంటుంది. స్పెషల్ కార్గోగా ఈ పండ్లను అంతర్జాతీయ మార్కెట్లకు తరలిస్తే రైతులు, ఈ ప్రాంత భవిష్యత్ మారిపోతుంది.
రాయలసీమలో అభివృద్ధికి భారీ పెట్టుబడులు
రాయలసీమ(Rayalaseema) ప్రాంతంలో ఇంకా కవర్ కానీ గ్యాప్ను గుర్తించి అక్కడకూ నీటి సరఫరా కోసం ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయండి. రాయలసీమకు మంచి రహదారులువచ్చాయి. మారుమూల ప్రాంతాలను కలు పుతూ మరికొన్ని రహదారులు రావాల్సి ఉంది. తద్వారా మార్కెటింగ్ మెరుగు పడుతుంది. ఉద్యాన పంటల సాగు మొదలుకుని మార్కెటింగ్ వరకు వివిధ ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఈమేరకు మొత్తంగా రూ.14,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఖర్చు పెట్టబోతున్నాం. ఇందులో సబ్సిడీ రూపంలో రూ.9,000 కోట్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈ విషయం రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి. అరటి, చీనీ, బొప్పాయి, దానిమ్మ, మామిడి, ఉల్లి, టమోటా, మిరప, నిమ్మ లాంటి వివిధ ఉద్యాన పంటలపై ఫోకస్ పెట్టాలి”అని సీఎం వివరించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల భూగర్భ జలాలు రాయలసీమలో మెరుగ్గా ఉన్నాయనే ప్రస్తావన వచ్చింది. హంద్రీనీవా సహా వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేస్తుండడం వల్ల సీమలో ఉద్యాన సాగు గతంతో పోల్చుకుంటే సులభతరం అయిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. పంటలు చక్కగా పండడం వల్ల ఓవైపు రైతులకు ఆదాయం రావడంతోపాటు… భూముల రేట్లు పెరిగాయని దానికి తమ ప్రాంత మైన ఉమ్మడి అనంతపుర జిల్లానే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, వ్యవసాయ, హార్టీకల్చర్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :