TG: తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు శ్రీకారం రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్, (sarpanch) వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామ స్థాయి రాజకీయాలు మళ్లీ రేపరేపులయ్యాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత నామినేషన్లు ఈ నెల 27 నుండి స్వీకరించబడతాయి.
Read also: GHMCలో 27 మున్సిపాలిటీల విలీనంకు కేబినెట్ ఆమోదం | హైదరాబాద్ పరిధి విస్తరణ…

only ones eligible to contest as Sarpanch..
సర్పంచ్‌గా పోటీ చేయాలంటే అర్హతలు
- గ్రామ పంచాయతీకి స్థానికుడు (రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం)
- ఓటర్ల జాబితాలో పేరు ఉండాలి
- కనీస వయస్సు 21 ఏళ్లు
- రిజర్వేషన్ సీట్లకు కుల ధృవీకరణ పత్రం
- మహిళలు రిజర్వ్ + జనరల్ రెండింటిలోనూ పోటీ చేయవచ్చు
- పిల్లల పరిమితి లేదు
ఎవరు పోటీ చేయలేరు?
ప్రభుత్వ–పంచాయతీ పనులకు కాంట్రాక్టర్లు
కేంద్ర/రాష్ట్ర/ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు
పంచాయతీకి బకాయిలు ఉన్నవారు
మతిస్థిమితం లేని వారు, బదిరులు, మూగవారు
1955 పౌరహక్కుల చట్టం కింద శిక్షపడినవారు
ఎన్నికల పరిధి & ఓటర్ల సంఖ్య
TG: ఈసారి 31 జిల్లాల్లో 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డు సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1.66 కోట్లకుపైగా ఓటర్లు బ్యాలెట్ విధానంలో ఓటు వేయనున్నారు.
షెడ్యూల్ వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: