TG: తెలంగాణ ప్రభుత్వపు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీపై రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా చర్చ నడుస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ మహిళకు చీర ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పలు గ్రామాల్లో మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish rao) తీవ్ర స్పందన వ్యక్తం చేస్తూ, నిజమైన అర్హులైన మహిళలకు చీరలు అందడం లేదని విమర్శించారు.
Read also: TG: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల

Women should be given Rs. 60 thousand each, Saree: Harish Rao
చెప్పేది, చేస్తున్నది కలవడం లేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు
TG: హరీశ్ రావు మాట్లాడుతూ, ఒక్క చీర ఇచ్చి ప్రభుత్వం పెద్ద సాయం చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం సరైంది కాదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మహాలక్ష్మి పథకం హామీ ప్రకారం ప్రతి మహిళకు రూ. 60 వేలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తుచేశారు. చీరల పంపిణీ పేరుతో హామీని మార్చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలు చీరలు పొందకపోవడం, గ్రామాల్లోనూ అనేక మంది అర్హులు వంచితులవుతుండటం ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్నారు.
అదే విధంగా, మహిళా సంఘాలకు వడ్డీరహిత రుణాల విషయంలో ప్రభుత్వం చెప్పేది, చేస్తున్నది కలవడం లేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మొత్తం 25 వేల కోట్ల రుణాలున్నా, అందులో ఐదువేల కోట్లకే వడ్డీ మాఫీ వర్తిస్తోందని, మిగతా మొత్తం వడ్డీతోనే భరించాల్సి వస్తోందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతీ పండుగకు మహిళలను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టేదని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయంలోనే పథకాలను ముందుకు తీసుకొస్తోందంటూ విమర్శించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: