శబరిమల (sabarimala) అయ్యప్పస్వామి దర్శనం కోసం భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మండల-మకరవిళక్కు సీజన్ నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు చేరుతుండటంతో, ఇప్పటికే తగ్గించిన స్పాట్ బుకింగ్‌లను పరిస్థితిని బట్టి మళ్లీ పెంచేందుకు దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఇటీవల కేరళ హైకోర్టు రద్దీ తగ్గించేందుకు రోజువారీ స్పాట్ టికెట్లను 20 వేల నుంచి 5 వేలకే పరిమితం చేయగా, భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ సంఖ్య పెంచేందుకు అనుమతి ఇచ్చింది. దీనితో అధికారులు 7,000 నుంచి 8,000 వరకు స్పాట్ బుకింగ్‌లను అందించే అవకాశం పరిశీలిస్తున్నారు.
Read also: Kiren Rijiju: డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు

Spot bookings for Sabarimala darshan have increased
భక్తులు భారీగా చేరుకుంటుండటంతో
పంపా, నీలక్కల్, నడపండల్, శరణ్‌గుత్తి వంటి ప్రాంతాల్లో భక్తులు భారీగా చేరుకుంటుండటంతో, దర్శన క్యూలైన్లు మళ్లీ కిక్కిరిసిపోయాయి. ఆదివారం నుంచి స్పాట్ బుకింగ్ సంఖ్య పెరగడంతో సోమవారం భక్తుల తాకిడి మరింతగా కనిపించింది. గత వారం ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి వారం రోజుల్లోనే ఆరున్నర లక్షల మందికిపైగా స్వామివారి దర్శనం చేసుకున్నారని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం 18 మెట్ల వద్ద ప్రతి నిమిషం సగటున 85 మంది భక్తులను అనుమతిస్తూ దర్శనం జరుపుతున్నారు.
భక్తుల భద్రత కోసం కేరళ పోలీసులు, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సన్నిధానం నుండి పంపా మార్గం వరకు మొత్తం 450 సీసీ కెమెరాలు అమర్చి నిఘాను పెంచారు. నడకదారుల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు సాగుతున్నాయి. సన్నిధానంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 24 గంటలూ కెమెరా ఫుటేజీ పర్యవేక్షణ జరుగుతోంది. దేవస్థానం బోర్డు, అటవీ, ఎక్సైజ్, పోలీసు విభాగాలు కలిసి భక్తుల రద్దీని నియంత్రించేందుకు, వారి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.
శబరిమలలో స్పాట్ బుకింగ్స్ ఎందుకు పెంచుతున్నారు?
భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో రద్దీని నియంత్రించడానికి స్పాట్ బుకింగ్స్ పెంచాలని అధికారులు నిర్ణయించారు.
హైకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చింది?
భక్తులు రద్దీలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, పరిస్థితులకు అనుగుణంగా స్పాట్ బుకింగ్స్ పెంచాలని హైకోర్టు అనుమతిచ్చింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: