హైదరాబాద్: HYD పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. మధుసూదన్ రెడ్డికి చెందిన రూ.80 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ (ED) అధికారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
Read also : Ibomma: రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

అక్రమాలు, బినామీ ఆస్తులు
మధుసూదన్ రెడ్డికి (Madhusudhan Reddy) చెందిన సంతోష్ షాండ్ అండ్ గ్రానెట్ కంపెనీ రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడిందని, ప్రభుత్వానికి రూ.39.8 కోట్ల రాయల్టీ చెల్లించలేదని ఈడీ అభియోగాలు మోపడం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏడాది మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు కార్యాలయాలలో ఈడీ అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలను జప్తు చేశారు. మధుసూదన్ రెడ్డికి చెందిన ఆస్తులు ఇతర వ్యక్తుల పేర్ల మీద ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు, వీరంతా మధుసూదన్ రెడ్డికి బినామీలుగా ఈడీ పేర్కొంది.
సబ్ కాంట్రాక్ట్ నిబంధనల ఉల్లంఘన
సంతోష్ షాండ్ అండ్ గ్రానెట్ సప్లయ్‌కు ప్రభుత్వం మైనింగ్ అనుమతి ఇస్తే, దానిని మధుసూదన్ రెడ్డి మరో భాగస్వామ్య సంస్థకు సబ్ కాంట్రాక్ట్‌కు ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే మధుసూదన్ రెడ్డికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని వారు వెల్లడించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :