డబ్బు, నగలతో ఊడాయించిన నిత్య పెళ్లికూతురు పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకోసం ఎన్నో కలలు కంటారు. కొత్తజీవితాన్ని మనసైన భాగస్వామితో స్థిరపడాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకోసం తమకు అన్నివిధాలుగా సరిపోయే జోడికోసం అన్వేషిస్తారు. మ్యారేజ్ బూరోల ద్వారా, తెలిసినవారి ద్వారా సంబంధాలను చూస్తారు. తమకు అన్నివిధాలుగా నచ్చితే, పెళ్లికి ఒకే చేసుకుంటారు. కానీ కొందరికి మాత్రం పెళ్లంటే అదొక ఉపాధి. పెళ్లి పేరుతో మోసం చేసి, అందినకాడికి దోచుకోవడం వారి నైజం. తాజాగా ఓ వ్యక్తి ఇలాంటి మోసానికి గురై, పోలీసులను ఆశ్రయించిన ఘటన ఇది.
Read Also: Atchannaidu: అన్నదాత అభివృద్ధికి 5 సూత్రాలు : మంత్రి అచ్చెన్నాయుడు

అందినకాడికి దోచుకెళ్లిన పెళ్లికూతురు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిరా (30) అనే మహిళను వరంగల్ జిల్లా (Warangal) పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన మట్టపల్లి దేవేందర్ రావు (31) అనే వ్యక్తి వివాహం చేసుకున్నారు. రూ.4లక్షలతో వివాహాన్ని ఘనంగా వేడుకలు చేసుకున్న వరుడు, వధువుకు 8.5 తులాల బంగారాన్ని కానుకగా పెట్టాడు. అయితే పెళ్లైన రెండోరోజుకే మహిళ ప్రవర్తనలో తేడా గమనించి, ఆమె ఫోన్ చెక్ చేయగా దేవేందర్ రావుకు షాక్ గురయ్యారు. తన భార్యకు అప్పటికే పెళ్లై, ఓ కూతురు కూడా ఉందని తెలుసుకుని, ఆమెను నిలదీశాడు.
దానికి ఆమె తనకు పెళ్లయిన మాట వాస్తవమే కానీ విడాకులు తీసుకున్నానని బుకాయించింది ఇందిర. ఇద్దరిమధ్య గొడవ జరగగా, ఉదయం లేలేచసరికి బంగారం, నగదుతో ఇందిర పారిపోయింది. దీంతో దేవేందర్ రావు లబోదిబోమంటూ మ్యారేజ్ బ్యూరో (Marriage Bureau) నిర్వాహకులు, మహిళ, ఆమె తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందిరా గతంలో కూడా ముగ్గురు యువకులను ఇదేతరహా మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమెకోసం అన్వేషిస్తున్నారు. పెళ్లి చేసుకునేముందు అన్నివిధాలుగా విచారించి నిర్ణయం తీసుకోవాలి. ఇటీవల ఇలాంటి మోసాలు (Cheating) తరచూగా జరుగుతున్నందున్న తగిన జగ్రత్తలు తీసుకుని, పెళ్లి చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: