తొట్టంబేడు: శ్రీకాళహస్తి మండలం సింహాచల కండ్రిగ రిజర్వ్ ఫారెస్టు (forest) వివాదం మళ్ళీ మొదటి కొచ్చింది. ఇక్కడ భూ వివాదాలకు సంబంధించి అటవీశాఖ పనులకు అటంకం కల్గిస్తున్నట్లు భావించి ఇక్కడ సోమవారం 144 సెక్షన్ ను విధించినట్లు అటవీ క్షేత్రాధికారి లోకేష్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సెక్షన్ మొక్కలు నాటే వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలోని సింహాచల కండ్రిగ ఫారెస్టులో వ్యవసాయ భూములకు పట్టాలున్నాయంటూ కొందరు రైతులు శాఖ చేపట్టిన చెట్టు నాటే కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారని వివరించారు. గతంలో ఇదే విధంగా వర్షాలకు ముందు ప్లాంటేషన్ ను జూన్ నెలలో సింహాచల కండ్రిగ గ్రామానికి చెందిన కనుమూరి కోటయ్య, కె. శంకరయ్య, బి.ప్రసాద్,. ఈ సాంబయ్య, తగ్గింపాటి తిరుపాల్ పై కేసు నమోదు చేసినట్లు అధికారి లోకేష్ వివరించారు.

Simhachala Kandriga land dispute resurfaces
అధికారులను అడ్డుకోవటం
వారు అటవీశాఖ అధికారులను అడ్డుకోవటం బెదిరించటం చేస్తున్నారని వివరించారు. రైతులకు అక్కడ కాకుండా ఇతర చోట భూములు చూపిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చి వారికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించినప్పటికి సంతృప్తి చెందక పనులకు ఆటంకం కల్గిస్తున్నట్లు వివరించారు. ఇనగలూరు రిజర్వ్ ఫారెస్టులో మొత్తం 120 ఎకరాల్లో అటవీశాఖ అధికారిప్లాంటేషన్ కు నిర్ణయించి నిధులు కేటాయించారన్నారు. సుమారు 70 ఎకరాల్లో చెట్టు నాటే కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత మళ్ళీ పేచీ ఎపెట్టి లొల్లి చేస్తున్నారని లోకేష్ వివరించారు. మిగిలిని భూముల్లో వర్షాకాలానికి ముందే చెట్టు నాటాల్సి ఉండగా అక్కడ పనులు చేసుకుంటున్న అటవీశాఖ సిబ్బంది విధులకు ఆటంకం కల్గిస్తున్నారని ఆయన వివరించారు. సింహాచల కండ్రిగకు చెందిన ఓ హింసాత్మక గుంపు ఇనగలూరు రిజర్వ్ పారెస్టులో తోటల పనిని అడ్డుకుంటున్నారని శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఇది మంచిది కాదన్నారు.
పర్యావరణాన్ని కాపాడుటకు
ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందన్నారు. పచ్చని చెట్లను పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడుటకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తే కొందరు స్వార్థపరుల చర్యలతో విధులకు ఆటంకం కల్గుతుందని లోకేష్ వివరించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (144పిఆర్పిసి) సెక్షన్ 163 కింద తనకు ఇవ్వబడిన అధికారాలను వినియోగించి ఇనగలూరు రిజర్వ్ ఫారెస్టు చట్టుపక్కల నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశమవ్వటానికి నిషేధించి ఉత్తర్వులు జారి చేసామన్నారు. మొక్కల నాటే కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ఉత్తర్వులు అమలు జరుగుతాయని వివరించారు. ఎవరైనా ఉత్తర్వులు ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు శిక్షకు గురౌతారని లోకేష్ ప్రకటించారు. ఈ మేరకు నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, శ్రీకాళహస్తి తహశీల్దార్, పోలీసు స్టేషన్ కు సమాచారం అందించినట్లు అటవీశాఖాధికారి లోకేష్ వివరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: