తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పెద్ద అభివృద్ధి: రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ 10 కళాశాలల కోసం 117.30 కోట్ల రూపాయలతో కొత్త భవనాల నిర్మాణం, ఆధునిక సదుపాయాలు కల్పించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం (PMJVK) కింద ఈ ప్రతిపాదనలు కేంద్రం-రాష్ట్ర సహకారంతో అమలు కానున్నాయి. ముఖ్యంగా మైనారిటీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, భవనాల రూపురేఖలు మార్చి స్మార్ట్ తరగతి గదులు, లైబ్రరీలు, ప్రయోగశాలలు, కొత్త ఫర్నిచర్, కంప్యూటర్లు వంటి ఆధునిక సౌకర్యాలు అందించనున్నారు.
Read also: Telangana: రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్

New buildings for government junior colleges
హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో
హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల కోసం 27.30 కోట్ల రూపాయలతో ఒక భారీ ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మించనుండగా, మిగతా తొమ్మిది కళాశాలలకు సుమారు 10 కోట్లు ప్రతీ కళాశాల కోసం కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ కళాశాలలు విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన, ప్రైవేట్ కళాశాలల సమానమైన విద్యా అనుభవాన్ని అందిస్తాయని విద్యాశాఖ వర్గాలు తెలిపారు. అభివృద్ధి చేయనున్న కళాశాలలలో ఫలక్‌నుమా, నల్గొండ, ఆదిలాబాద్, భైంసా, ముధోల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోరబండ తదితర ప్రాంతాల జూనియర్ కళాశాలలు ఉన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: