ఇజ్రాయెల్-హమాస్ లమధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో రెండు దేశాలు తమతమ బందీలను విడుదల చేసుకున్నారు. అయితే ఇజ్రాయెల్ మళ్లీమళ్లీ గాజాపై దాడులకు పాల్పడుతున్నది. ఇప్పటికే పలుమార్లు దాడికి దిగింది.
Read Also: Pawan Kalyan: ఏలూరు జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్
గాజాను బూడిదదిబ్బగా మార్చిన ఇజ్రాయెల్ (Israel) ఇంకా తన పగను చల్లార్చుకునేందుకు దాడులకు పాల్పడుతున్నది. ఈ 44 రోజుల్లో 500 సార్లు ఉల్లంఘించిందని గాజా (Gaza) పేర్కొంది. ఈ దాడుల్లో 342 పౌరులు మృతి చెందారని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇదిలా ఉండగా లెబనాన్ పై జరిపిన దాడుల్లో హెజ్ బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం: గాజా
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు క్రమబద్ధంగా ఉల్లంఘిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మానవతా చట్టానికి స్పష్టమైన విరుద్ధం. దీనిని మేం ఖండిస్తున్నాం. ఈ ఉల్లంఘనలు శనివారం ఒక్కరోజే 27 జరిగాయి. వాటిలో 24మంది మృతి చెందగా, 87
మంది గాయపడ్డారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం అవసరమైన సహాయం, మందులు గాజాకు నిర్బంధం లేకుండా చేరాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ ఈ సరఫరాలపై ఇప్పటికీ కఠిన ఆంక్షలు కొనసాగిస్తోంది’ అని గాజా మీడియా పేర్కొంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: