బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Read Also: Dharmendra: ధర్మేంద్ర చివరి మూవీ ఇదే

భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం ధర్మేంద్ర మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నటనతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు.
ధర్మేంద్ర (Dharmendra) కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: