Siddaramaiah: కర్ణాటకలో సీఎం మార్పుపై వస్తున్న ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ముఖ్యం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్ఠానం సూచిస్తే తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు సిద్ధమని ఆయన చెప్పారు. సీఎం పదవి మార్పుపై తుది మాట కేంద్ర నాయకత్వానిదేనని కూడా తెలిపారు.
Read also: Justice Suryakant: ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తి అవుతానని ఊహించలేదు: జస్టిస్ సూర్యకాంత్

Siddaramaiah
చెరో రెండున్నరేళ్లు సీఎంగా కొనసాగుతారనే
Siddaramaiah: అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని తాను మాత్రమే కాదు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తప్పనిసరిగా అంగీకరించాల్సిందేనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం తానే పదవిలో కొనసాగుతానని చెప్పిన ఆయన, ప్రస్తుతం నిర్ణయం పూర్తిగా అధిష్ఠానంపైనే ఉందని చెప్పడం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తోంది.
2023 ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య–డీకే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా కొనసాగుతారనే ప్రచారం బలంగా వినిపించింది. ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఆయనకు సీఎం అవకాశం రావచ్చని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో వారి నాయకులు ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: