డాలర్‌తో పోలిస్తే రూపాయి(Currency Crisis) రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో రాజకీయ వాదోపవాదాలు మళ్లీ ముదురుతున్నాయి. రూపాయి విలువ 90 మార్క్‌ను తాకే దిశగా సాగుతుండటంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్(Jairam Ramesh) ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు లేవనెత్తారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ రూపాయి పతనంపై యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన వీడియోను జైరామ్ X (మాజీ ట్విట్టర్)లో షేర్ చేశారు. అప్పటి మాటలను ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితులతో పోల్చుతూ, “అప్పుడైతే విమర్శించారు… ఇప్పుడు రూపాయి ఎందుకు ఈ స్థాయికి పడిపోయిందో చెప్పాలి కదా?” అని ప్రశ్నించారు.
Read Also: Flight Rules: ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్! ఈ 10 వస్తువులు నిషేధం

రూపాయి విలువ—తాజా స్థితి
- శుక్రవారం: 89.5800
- సోమవారం: 89.7300
డాలర్ బలపడటం(Currency Crisis), గ్లోబల్ ఆర్థిక అస్థిరత, విదేశీ పెట్టుబడుల తగ్గుదల వంటి అంశాలు రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం ఆర్థిక వ్యవస్థను కేంద్రం సరిగా నిర్వహించలేకపోవడమే కారణమని ఆరోపిస్తోంది. జైరామ్ రమేశ్ వ్యాఖ్యల్లో, “యూపీఏ కాలంలో రూపాయి పడితే మోదీజీ పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవారు. ఇప్పుడు రూపాయి చరిత్రలోనే కనిష్టానికి చేరిపోయింది. ఈరోజు ఆయన నిశ్శబ్దం ఎందుకు?” అని ప్రశ్నించారు. ఇక BJP మాత్రం గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల కారణంగానే రూపాయి విలువ ప్రభావితమవుతున్నదని చెబుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: