బాలీవుడ్‌లో హీరో షర్ట్ తీసేసే ట్రెండ్ సల్మాన్ ఖాన్‌దే(Salman Khan) అని చాలామంది భావిస్తారు. కానీ ఆ స్టైల్‌కి అసలు ఆరంభకుడు వెటరన్ నటుడు ధర్మేంద్ర.(Dharmendra) 1966లో విడుదలైన ‘ఫూల్ ఔర్ పత్తర్’ చిత్రంలో ఓ వృద్ధురాలు చలితో వణుకుతున్న సన్నివేశంలో, ధర్మేంద్ర తన షర్ట్ తీసి ఆమెకు కప్పే సీన్ సినిమా చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
Read Also: Dharamendra: లెజెండ్ ధర్మేంద్ర ఇక లేరు!

సల్మాన్ కాదు… 1966లోనే ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టిన ధర్మేంద్ర
ఈ సీన్ మాత్రమే కాదు, ధర్మేంద్ర కెరీర్‌లోనూ అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆసక్తికర విషయమేమిటంటే—ఆ సన్నివేశంలో షర్ట్ తీసి ఇవ్వాలన్న ఐడియాను దర్శకుడికి స్వయంగా ధర్మేంద్రే(Dharmendra) సూచించడం. అదే తర్వాత ఆయనకు యాక్షన్, మాస్ అప్పీల్‌తో కూడిన ఇమేజ్‌ను బలపర్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోలు షర్ట్ తీసే సీన్లు స్టైల్‌గా మారాయి. కానీ ఈ ట్రెండ్‌ను మొదటిసారి తెరపైకి తీసుకువచ్చింది ధర్మేంద్రనే అనడం చాలామందికి ఇప్పుడు తెలిసిన నిజం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: