ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వనపర్తిలో జరిగిన జాగృతి ‘జనం బాట’ కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె, ‘పుచ్చు వంకాయ’, ‘సచ్చు వంకాయ’ వంటి అవమానకర పదాలు ఉపయోగిస్తే ఇకపై సహించబోనని స్పష్టం చేశారు. ‘‘మా తండ్రి వయసు వారు కావడంతో ఇంతకాలం మౌనం పాటించాను. కానీ మరలా ఇలాంటి మాటలు మాట్లాడితే గట్టిగా ఎదురు స్పందిస్తాను’’ అని హెచ్చరించారు.
Read also: Drugs: న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్

Kalvakuntla’s poem warning to former minister Niranjan Reddy
ఆయనపై స్థానికంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయ
కవిత మాట్లాడుతూ, నిరంజన్ రెడ్డి అవినీతి, అక్రమాలు వనపర్తి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. ఆయనపై స్థానికంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయని, ప్రజలు కూడా స్పష్టంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ‘‘ఈ విషయాలు కేసీఆర్ గారి దృష్టికి ఇప్పటి వరకు చేరలేదేమో అనిపిస్తోంది. అందుకే మీడియా ద్వారా తెలియజేస్తున్నాను’’ అని కవిత పేర్కొన్నారు. మూడు ఫార్మ్‌హౌస్‌లు, అసైన్డ్ భూముల అంశాల్లో కూడా అనుమానాలు ఉన్నాయని ఆమె అన్నారు.
అలాగే బీసీలపై, ఉద్యమకారులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరైంది కాదని కవిత విమర్శించారు. తహశీల్దార్ కార్యాలయం కాలబెట్టిన ఘటనపై కూడా నిరంజన్ రెడ్డిని ప్రశ్నించారు. ‘‘ప్రజా సమస్యలపై నేను మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు? భూదాహం, ధనదాహానికి హద్దు ఉండాలి’’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: