బాలీవుడ్ ఐకాన్, సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharamendra) (89) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు.
Read Also: Drugs: న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్

అరవై ఏళ్లకు పైగా సినీ ప్రయాణం చేసిన ధర్మేంద్ర,(Dharamendra) భారతీయ సినిమాల్లో అత్యంత విజయవంతమైన నటుల్లో ఒకరిగా నిలిచారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ‘యాక్షన్ కింగ్’, ‘హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్’ పేర్లతో ప్రత్యేక గుర్తింపు పొందారు. షోలే, సీతా ఔర్ గీతా, చుప్కే చుప్కే, ధర్మ్ వీర్, గజబ్, ఆంఖే, మేరా గావ్ మేరా దేశ్, యాదోం కీ బారాత్ వంటి అనేక బ్లాక్బస్టర్లు ఆయన కెరీర్ను శిఖరాలకు చేర్చాయి.
వ్యక్తిగత జీవితం
1935 డిసెంబర్ 5న పంజాబ్లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయనకు ఇద్దరు భార్యలు – ప్రకాశ్ కౌర్, హేమమాలిని. సన్నీ డియోల్, బాబీ డియోల్, ఇషా డియోల్ సహా ఆరుగురు పిల్లలకు ఆయన తండ్రి. సినీ ప్రపంచానికి, కోట్లాది అభిమానులకు ఆయన మరణం లోటు నింపలేనిది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: