హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Sajjanar) ఆదివారం అర్ధరాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనేక రౌడీషీటర్ల ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించి వివరాలు సేకరించారు. పోలీసు బృందాలతో కలిసి ఆయన స్వయంగా పెట్రోలింగ్(Patrolling) చేస్తూ, రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాల యజమానులకు నియమాలు పాటించాలని కఠినంగా సూచించారు. గస్తీ సిబ్బంది అప్రమత్తత, వారు స్పందించే వేగం, గస్తీ పాయింట్ల నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా పర్యవేక్షించారు.
Read Also: Drugs: న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్
అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు లంగర్ హౌస్, టోలిచౌకి పరిసరాల్లో ఆయన నైట్ పట్రోల్ నిర్వహించారు. రౌడీషీటర్ల నేర చరిత్ర, వారి ప్రస్తుత జీవన విధానం గురించి తెలుసుకుని, నేరాల నుండి దూరంగా ఉండాలని వారిని హెచ్చరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: