
తమిళనాడు తెనాకాశీ జిల్లాలో(Tamilnadu accident) అమానుష రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదం అక్కడి ప్రజలను షాక్‌కు గురిచేసింది. ‘జర్నీ’ సినిమాలో చూపించినట్టే ఎదురెదురుగా వచ్చిన రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి భారీగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Also: Hyd Crime: కారు ప్రమాదంలోదుర్మరణమైన వ్యక్తి హనుమకొండ వాసిగా గుర్తింపు
ప్రమాద(Tamilnadu accident) ప్రభావం ఎంత తీవ్రమైందంటే, బస్సుల ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. రక్తమాంసాల ధారలు, విరిగిన సీట్లు, చెల్లాచెదురైన సామాన్లతో అక్కడి దృశ్యం భారీవిషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో చిక్కుకున్నవారి అరుపులు, సహాయం కోసం చేసిన ప్రయత్నాలు అక్కడి వారిని కుదేలు చేశాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సుల డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా? లేక వేగమే ప్రమాదానికి దారితీసిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: