(Hyd Crime) ORRపై జరిగిన ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తి దుర్గాప్రసాద్ (34)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ ప్రాంత వాసి అని తెలిపారు. నగరంలో వ్యాపారం నిమిత్తం వచ్చి ఇంటికి వెళ్లేందుకు దుండిగల్‌లోని ORR వైపు మళ్లించాడని, శామీర్‌పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఉదయం 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
Read Also: CyberCrime: శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్సైట్ మోసం

ఏసీ ఆన్ చేసి నిద్రించాడా?
ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం.. కారు డ్రైవర్ వాహనాన్ని రింగ్ రోడ్డు పక్కన ఆపి ఏసీ వేసుకొని కారులోనే నిద్రిస్తున్న సమయంలోనే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్‌కు బయటకు వచ్చే అవకాశం దొరకలేదు. కారు పూర్తిగా కాలి బూడిదైంది.
సమాచారం అందుకున్న వెంటనే శామీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను, అలాగే మృతుడి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: