ఇటీవల వన్డే వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోగా.. తాజాగా మరో వరల్డ్ కప్‌ను కూడా టీమిండియా ఖాతాలో వేసుకుంది.అంధ మహిళల టీ20 ప్రపంచకప్ (India Women’s Blind Cricket team) విజేతగా నిలిచింది. మొట్టమొదటి అంధులు టీ20 మహిళా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.
Read Also: T20 Blind World Cup: ప్రపంచకప్ విజేతగా టీమిండియా..మెరిసిన ఇద్దరు తెలుగమ్మాయిలు
ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు, దివ్యాంగ మహిళా క్రీడాకారుల ధైర్యం, ప్రతిభ, కలలకు దక్కిన గొప్ప గౌరవంగా చెప్పవచ్చు. ఈ టోర్నమెంట్‌లో (India Women’s Blind Cricket team) భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్‌గా నిలవడం గొప్ప విషయం.అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిస్తే కోట్లాది రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది.
ఈ నెల ప్రారంభంలో భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచినప్పుడు కూడా ఆటగాళ్లపై కోట్లాది రూపాయల నగదు బహుమతులు కురిశాయి. కానీ చారిత్రక విజయాన్ని అందుకున్న భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు మాత్రం చాలా చిన్న ప్రైజ్ మనీ దక్కింది.

ప్రైజ్ మనీ ఎంతంటే?
ఈ చారిత్రక విజయం తర్వాత టీమిండియాలోని ప్రతి క్రీడాకారిణికి లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి లభించనుంది. ఈ ప్రైజ్ మనీని చింటల్స్ గ్రూప్ (Chintals Group) అనే సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) నుంచి ఎలాంటి అధికారిక ప్రైజ్ మనీ ప్రకటన రాలేదు.
అయితే ఈ ఛాంపియన్ జట్టు భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, CABI కూడా నగదు బహుమతిని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే, ఈ క్రీడాకారులకు వారి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఆర్థిక సహాయం లేదా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఇంత గొప్ప గౌరవం తెచ్చిన అంధ క్రీడాకారిణులకు మరింత మెరుగైన ప్రైజ్ మనీ, ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: