శ్రీశైలంలోని ఏపీ టూరిజం(AP Tourism) హరిత హోటల్ పేరును ఉపయోగించి సైబర్ నేరగాళ్లు(CyberCrime) నకిలీ వెబ్‌సైట్ నడుపుతున్న ఘటన బయటపడింది. దాదాపు ఏడాది నుంచి భక్తులను మోసం చేస్తున్న ఈ స్కామ్‌లో తాజాగా ఓ పర్యాటకుడు భారీ మొత్తం కోల్పోవడంతో వ్యవహారం బయటకు వచ్చింది.
Read Also: Insurance: బీమా సంస్థల విలీనంపై కేంద్ర దృష్టి: పార్లమెంట్‌లో కొత్త బిల్లు?

బెంగళూరు పర్యాటకుడు వలలో పడిన విధానం
బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి శ్రీశైలం వసతి, దర్శనం కోసం ఆన్‌లైన్‌లో(CyberCrime) వెతికే సమయంలో హరిత హోటల్ పేరుతో కనిపించిన ఒక నకిలీ వెబ్‌సైట్‌ను అధికారికదిగా భావించి ₹15,950 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. రశీదు తీసుకుని శ్రీశైలం చేరుకున్న తర్వాత, స్థానిక పర్యాటక రిసార్ట్‌లో చూపించగా అది నకిలీ రసీదని సిబ్బంది తెలియజేయడంతో పర్యాటకుడు షాక్‌కు గురయ్యాడు.
గతంలోనే ఫిర్యాదు ఉన్నా చర్యలు లేవని ఆరోపణ
ఈ నకిలీ వెబ్‌సైట్ గురించి హరిత రిసార్ట్ మేనేజర్ ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, పెద్దగా స్పందన లేకపోవడం వల్లే నేరగాళ్లు ధైర్యంగా మోసాలు కొనసాగించినట్లు తెలిసింది. దీంతో ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, భక్తులు మరియు పర్యాటకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వసతి బుకింగ్స్ కోసం తెలియని వెబ్‌సైట్లు ఉపయోగించకుండా, కేవలం ఏపీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :