Gold Rate 24/11/25 : పసిడి ప్రియులకు మరోసారి అలర్ట్. క్రితం రోజున రెట్టింపు వేగంతో పెరిగిన బంగారం ధరలు, నవంబర్ 24న దేశీయ మార్కెట్లో మాత్రం స్థిరంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రపంచ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేట్లు తిరిగి గణనీయంగా పడిపోయాయి. ఒక్క రోజులోనే ఔన్స్ గోల్డ్ ధర 25 డాలర్ల మేర తగ్గింది, ఇది భారతీయ బులియన్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
భారతీయులకు బంగారం అంటే ఉన్న ప్రేమ కొత్తది కాదు. శతాబ్దాలుగా (Gold Rate 24/11/25) పసిడి ఆభరణాలు మన సంస్కృతిలో భాగమైపోయాయి. ఈ కారణంగానే భారత్ గోల్డ్ దిగుమతుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. 2025లో బంగారం ధరలు 60% పైగా పెరిగినా కొనుగోళ్లు తగ్గలేదంటే పసిడి పట్ల మన ప్రేమ అర్థం అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడి, యుద్ధాలు, వాణిజ్య అనిశ్చితి పెరగడం వంటి కారణాలు రేట్లను పైకి తోసాయి.
Latest News: Farmer Critique: 18 నెలల పాలనపై జగన్ సూటి విమర్శలు
గత వారం రోజుల్లో గోల్డ్ మార్కెట్ రోలర్‌కోస్టర్‌లా మారిపోయింది. కొన్నిరోజులు భారీగా పడిపోగా, ఒక్కరోజులోనే మళ్లీ పెరిగింది. క్రితం రోజు భారీ పెరుగుదల తర్వాత, ఈరోజు దేశీయంగా రేట్లు స్థిరంగా నమోదయ్యాయి. మరి హైదరాబాద్ మార్కెట్‌లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
హైదరాబాద్‌లో బంగారం ధరలు (24 క్యారెట్ల)
క్రితం రోజు రూ.1,860 పెరిగిన మేలిమి బంగారం ఇవాళ అదే స్థాయిలో ఉంది.
10 గ్రాములకు ధర: ₹1,25,840
22 క్యారెట్ల గోల్డ్ రేటు (Gold Rate 24/11/25)
నిన్నటి రోజున రూ.1,700 పెరిగిన 22 క్యారెట్ల ధర కూడా ఇవాళ మారలేదు.
10 గ్రాములకు ధర: ₹1,15,350
హైదరాబాద్ వెండి ధర (Gold Rate 24/11/25)
వెండి కూడా స్థిరంగానే ఉంది. అయితే నిన్న కిలోకు ₹3,000 భారీ పెరుగుదల జరిగింది.
ఇప్పుడు కిలో వెండి ధర: ₹1,72,000
ఇక ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఇది ₹1,55,000 వద్ద లభిస్తోంది.
గమనిక: పై ధరలు నవంబర్ 24 ఉదయం 7 గంటల సమయంలో నమోదైనవి. మధ్యాహ్నానికి పన్నులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరలు మారే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు ముందు మీ ప్రాంతంలోని తాజా రేట్లు తప్పనిసరిగా తెలుసుకోండి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :