రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ (TG) మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్‌డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
Read Also: Sangareddy Crime: – కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

APK ఫైల్ ఓపెన్ చేయొద్దు- పోలీసుల హెచ్చరిక
గత రెండ్రోజులగా వాట్సాప్ గ్రూప్‌లు హ్యాక్ అవుతున్నాయని రిపోర్టులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. హ్యాకర్లు డేటాను దొంగిలించడం కోసం లేదా మీ అకౌంట్‌ను కంట్రోల్ చేసేందుకు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని అంటున్నారు. ఇన్‌స్టాల్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఫార్వార్డ్ చేసే మెసెజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ చేయాలని అంటున్నారు.
WhatsApp వ్యవస్థాపకులు ఎవరు?
WhatsAppను జాన్ కౌమ్ (Jan Koum), బ్రయాన్ యాక్టన్ (Brian Acton) స్థాపించారు. ఇద్దరూ పూర్వం Yahoo! లో కలిసి పనిచేశారు.
WhatsApp ఎప్పుడు ప్రారంభమైంది?
WhatsApp అధికారికంగా 2009లో విడుదలైంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: