పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా, సినిమా పైరసీ( Piracy) చర్యలు అదుపులోకి రావడం లేదు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్టు చేసి, ఐబొమ్మతో పాటు బొప్పం టీవీ వంటి ప్లాట్‌ఫార్మ్‌లను మూసివేసినా, పైరసీ పెద్దగా తగ్గలేదు. ఆగింది ఐబొమ్మ మాత్రమే, పైరసీ మాత్రం మరింత వేగంతో కొనసాగుతున్నట్లు తాజా పరిణామాలు చూపిస్తున్నాయి.
Read Also: Ibomma: రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: రవి తండ్రి

శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలన్నీ అదే రోజున పైరసీ( Piracy) సైట్లలో ప్రత్యక్షమయ్యాయి. ముఖ్యంగా ఐబొమ్మ కంటే ముందే అక్రమంగా సినిమాలను అప్‌లోడ్ చేస్తూ వచ్చిన మూవీరూల్జ్ మరోసారి కొత్త చిత్రాలను పూర్తిగా లీక్ చేసింది. థియేటర్లలో కెమెరాతో రికార్డు చేసి మూవీరూల్జ్‌లో అప్‌లోడ్ చేసినట్లు అంచనా. ’12 ఏ రైల్వే కాలనీ’, ‘సంతాన ప్రాప్తిరస్తు’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ప్రేమంటే’ వంటి సినిమాలు విడుదలైన కొద్దిగంటల్లోనే సైట్‌లో కనిపించడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :